Wife and Husband: పక్షుల్లో అందమైనదంటే చిలుక. దీంతో దాన్ని అందరు బంధిస్తారు. అది ఓసారి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తనను అందరు బంధిస్తున్నారు అని మొరపెట్టుకుందట. దానికి దేవుడు పిచ్చిదాన నిన్నెవరు బంధిస్తారు. నీ అందమే నీకు బంధమైంది అని చెప్పడంతో కిక్కురుమనకుండా తిరిగి వచ్చిందట. అందానికుండే బాధలు అలాంటివి. అందంగా ఉంటే చాలు అనుమానపు బీజాలు కూడా పెరుగుతాయి. భర్త కంటే భార్య అందంగా ఉంటే మొదట్లో ప్రేమగానే ఉంటుంది. కానీ తరువాత అదే శాపమవుతుంది. చివరకు కాపురమే అంధకారమవుతుంది. అందంగా ఉండటం తప్పు కాదు అందమైన మనసు లేకపోవడం తప్పు అని తెలుసుకోరు.
ఒకప్పటి మిస్ వరల్డ్ సుస్మితాసేన్ చెప్పినట్లు బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పది. అందంగా ఉండటం కంటే అందమైన మనసు ఉండటం గొప్ప. బంగ్లాలో ఉండే వారికి బజారు బుద్ధి ఉండొచ్చు. బజారులో ఉండే వారికి బంగారమైన మనసు ఉండొచ్చు. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకసారి మనిషిపై అనుమానం అనే బీజం పడితే అది సులువుగా పోదు. దీంతో సంసారమే దహించుకుపోతుంది.
తమిళనాడులోని విధుర్ నగర్ కు చెందిన కణ్ణన్ అందమైన భార్యను ఏరికోరి చేసుకున్నాడు. మొదట్లో బాగానే చూసుకునే వాడు. భర్త ప్రేమలో భార్య కూడా ఒదిగిపోయేది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఏమైందో ఏమో కానీ పిల్లలు కలిగాక భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు కలిగిన పిల్లల్లో చిన్నవాడి కాళ్లు, చేతులు తనలా లేవని రోజూ వేధించేవాడు. వాడిని ఎవరికి కన్నావని దూషించేవాడు.దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించేది. భర్త నిర్వాకంతో నిత్యం నరకం అనుభవించేది.
Also Read: Wife and Husband: మీ భార్య మిమ్మల్ని పేరుతో పిలుస్తోందా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడావ్? వాడికి నీకు ఏం సంబంధం అని నిలదీసేవాడు. చివరకు పాలవాడితే మాట్లాడినా తప్పుబట్టేవాడు. దీంతో ఆమెకు రోజూ వేధింపులతోనే కాలం గడిచేది. తనలో పెరిగిన అనుమానానికి అతడిలో రాక్షసత్వం పెరిగిపోయింది. భార్యతో నిత్యం గొడవలతోనే దినచర్య ప్రారంభమయ్యేదంటే అతడిలో అనుమానం ఎంత గూడు కట్టుకున్నదో అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో జనవరి 10న భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ రేగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. పిల్లలు అనాథలయ్యారు. క్షణికావేశమే వారి సంసారాన్ని నాశనంచేసింది. అనుమానమనే పెను బీజమే వారి పాలిట శాపమైంది.
Also Read: మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు?