https://oktelugu.com/

Vastu Tips: ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు ఎందుకు ఉండకూడదు అంటారో తెలుసా?

Vastu Tips: సాధారణంగా ప్రతి ఇంట్లో ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఓకే వంటగది ఉంటుంది.ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే భోజనాలు తయారు చేయడం మనం చూస్తున్నాము కానీ ప్రస్తుత కాలంలో ఒకే ఇంట్లోనే నివసిస్తున్నప్పటికీ ఆ కుటుంబంలో విడివిడిగా వంటగది ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ఒక తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు వారికి పెళ్లిళ్లు చేసి ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పుడు వీరందరూ పడక గదితో పాటు వంటగదిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2022 / 10:38 AM IST

    Vastu Tips

    Follow us on

    Vastu Tips: సాధారణంగా ప్రతి ఇంట్లో ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఓకే వంటగది ఉంటుంది.ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే భోజనాలు తయారు చేయడం మనం చూస్తున్నాము కానీ ప్రస్తుత కాలంలో ఒకే ఇంట్లోనే నివసిస్తున్నప్పటికీ ఆ కుటుంబంలో విడివిడిగా వంటగది ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ఒక తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు వారికి పెళ్లిళ్లు చేసి ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పుడు వీరందరూ పడక గదితో పాటు వంటగదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ ఈ విధంగా ఒకే ఇంటిలో మూడు పొయ్యిలు ఉండకూడదని చెబుతారు.

    పురాణాల ప్రకారం వేద గ్రంథాలలో శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో వీటి గురించి ప్రస్తావించబడింది. పూర్వం ఒక ఒక మనిషికి ఇద్దరు సంతానం మాత్రమే ఉండాలని వేదాలు చెప్పాయి. ఒకరు జేష్టుడు మరొకరు కనిష్టుడు ఇలా ఇద్దరు సంతానం మాత్రమే ఉండాలని ఈ గ్రంధంలో చెప్పబడింది. ఇలా కాకుండా ముగ్గురు సంతానం లేదా నలుగురు సంతానం అయితే వారిని కామజుడు అనే పేరుతో పిలిచేవారు. ఇలా ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లో రెండు పొయ్యిలు ఉంటాయి. అలా కాకుండా ముగ్గురు సంతానం అయితే మూడు పొయ్యిలు ఉంటాయి కనుక ఇద్దరు సంతానం మాత్రమే ఉండాలని చెప్పేవారు.

    అయితే మూడు పొయ్యిలు ఎందుకు ఉండకూ ఇంట్లో రెండు కన్నా ఎక్కువ పొయ్యిలు ఉండటం వల్ల ఆ ఇంట్లో అనేక సమస్యలు వెంటాడతాయి. అందుకే ఇంటికి రెండు పొయ్యిలు మాత్రమే ఉండాలని చెబుతారు. ఇక ఇద్దరు సంతానం రెండు పొయ్యిలను పెట్టుకోవచ్చు. తల్లిదండ్రి ఎల్లప్పుడూ కూడా జేష్ఠ పుత్రుడు దగ్గర మాత్రమే ఉండాలి. అలా కుదరని పక్షంలో చిన్న కొడుకు దగ్గర నివసించాలి. అంతేకానీ తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఉంటూ ఇంట్లో వారు కూడా ఒక పొయ్యి వెలిగించకూడదని శాస్త్రం చెబుతోంది.