Homeలైఫ్ స్టైల్Cheda Purugulu: ఇంట్లో వ‌స్తువులు చెద‌లు ప‌ట్టాయా.. జీవితంలో ఈ ఇబ్బందులు త‌ప్ప‌వు..!

Cheda Purugulu: ఇంట్లో వ‌స్తువులు చెద‌లు ప‌ట్టాయా.. జీవితంలో ఈ ఇబ్బందులు త‌ప్ప‌వు..!

cheda-purugulu: మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఇంటి ప‌రంగా అయితే ఎన్నో వాస్తు విష‌యాల‌ను పాటిస్తుంటారు చాలామంది. ఇలా ఇంట్లో ఉండే వ‌స్తువులు ఉండే తీరును బ‌ట్టి కూడా మ‌న జీవితంలో కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా ఇప్పుడు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌కు చెద‌లు ప‌డితే కూడా అనేక అన‌ర్థాలు జ‌రుగుతాయంట‌. ఇంట్లో ఉండే ఏ వ‌స్తువుకు చెద‌లు ప‌ట్టినా స‌రే మ‌న జీవితం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Cheda Purugulu
Cheda Purugulu

 

అందుకే ఇంట్లో ఉండే పాత వ‌స్తువులు లేదా పాత పుస్త‌కాల‌ను ప‌డేయాలి. అలాగే ఎలాంటి చెక్క వ‌స్తువుల‌ను కూడా ఎక్కువ కాలం ఇంట్లో ఉంచ‌కూడ‌దు. అలాగే ఇంటి ముఖ ద్వారా అంటే ప్ర‌ధాన ద్వారం మీద ఎలాంటి వాన చినుకులు ప‌ట్ట‌కూడ‌దు. అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎలాంటి చెద‌లు ప‌ట్టినా స‌రే ఆ ఇంటిపెద్ద‌కు హార్ట్ ఎటాక్ లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంట‌. అందుకే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎలాంటి చెద‌లు ప‌ట్టుకుండా చూసుకోవాలి.

Cheda Purugulu
Cheda Purugulu

ఏ మాత్రం పాడైపోయిన‌ట్టు జ‌రిగినా స‌రే ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ క‌నిపిస్తుంది. అలాగే ప్ర‌ధాన ద్వారం అనేది ఎప్పుడైనా చెక్క‌తోనే ఉండాలి. ఈ మ‌ధ్య చాలామంది ఇనుము లేదంటే ప్లాస్టిక్ లాంటి బ‌ల‌మైన వాటితో ప్ర‌ధాన ద్వారాన్ని పెట్టుకుంటున్నారు. ఇలా చెక్క కాకుండా ఇత‌ర వాటితో చేస్తే ఆర్థిక ఇబ్బందులు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. అందుకే కేవ‌లం ప్ర‌ధాన ద్వారాన్ని మాత్రం స్వ‌చ్ఛమైన చెక్క‌తోనే త‌యారు చేసుకోవాలి.

Also Read: ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు ఎందుకు ఉండకూడదు అంటారో తెలుసా?

ఇంటి ముఖ ద్వారం ఎంత అందంగా ఉంటే.. ఆ ఇంట్లో ప‌రిస్థితులు అంత బాగా ఉంటాయ‌ని వాస్తు నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. ఇక‌పోతే ఎప్ప‌టిక‌ప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలని కూడా చాలామంది వెల్ల‌డిస్తున్నారు. అందుకే ఎలాంటి ముఖ ద్వారాన్ని అయినా స‌రే కేవ‌లం చెక్క‌తోనే పెట్టుకోవాలి. ఇలా ఇంట్లో ఎలాంటి చెద‌లు ప‌ట్ట‌కుండా వ‌స్తువులు ఉంటే ఆ ఇంట్లో ఉండే వారి జీవితాలు అంత అందంగా ఉంటాయ‌ని వాస్తు నిపుణులు వివ‌రిస్తున్నారు.

Also Read: మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Upcoming Elections: దేశంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికలతో ఆరంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా స్టేట్లలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నగారా మోగించింది. దీంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. 2024లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఇందులో ఎలాగైనా నెగ్గాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. […]

  2. […] Corona: గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమను కరోనా ముప్పతిప్పలు పెడుతుంది. షూటింగ్స్, రిలీజులు, సినిమా వేడుకలేవి అనుకున్న ప్రకారం జరగడం లేదు. చెప్పిన తేదీకి సినిమా విడుదల కావడం చాలా కష్టమైపోతుంది. థియేటర్లోకి సినిమా వచ్చే వరకు ప్రేక్షకుడికి నమ్మకం ఉండటం లేదు. నేడే విడుదల పోస్టర్ చూడడం గగనమైపోతుంది. 2022 సంక్రాంతి బరిలో దిగాల్సిన చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వాయిదా పడ్డాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. […]

Comments are closed.

Exit mobile version