Homeఎంటర్టైన్మెంట్Dasara- Rangasthalam: ‘దసరా’, ‘రంగస్థలం’ మధ్య పోలిక ఎందుకు? ఈ రెండు సినిమాలకు సంబంధం ఏంటి?

Dasara- Rangasthalam: ‘దసరా’, ‘రంగస్థలం’ మధ్య పోలిక ఎందుకు? ఈ రెండు సినిమాలకు సంబంధం ఏంటి?

Dasara- Rangasthalam
Dasara- Rangasthalam

Dasara- Rangasthalam: నేచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ మాస్ మూవీ ‘దసరా’. ఇటీవల రిలీజైన ఈ సినిమా సాలిడ్ టాక్ తెచ్చుకుంది. ఊర మాస్ లెవల్లో ఉన్న ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు ప్రశంసలు వస్తున్నాయి. ఇందులో నానితో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ నటనకూ మంచి మార్కులే పడ్డాయి. అయితే నాని నటించిన ‘దసరా’ మూవీని, మెగా పవర్ స్టార్ నటించిన ‘రంగస్థలం’ సినిమాతో పోలుస్తున్నారు. రెండు సినిమాల్లో హీరో విధ్వంసకర నటనతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశారని అంటున్నారు. రెండూ ఓ సంఘటన నేపథ్యంలోనే సినిమా సాగుతుంది. అయితే ఈ రెండు సినిమాలను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అసలేంటీ కథ?

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ‘దసరా’ ఈ గురువారం థియేటర్లోకి వచ్చింది. బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా షూటింగ్ మొత్తం ఉత్తర తెలంగాణలోని గోదావరిఖని ప్రాంతంలో చిత్రీకరించారు. శ్రీకాంత్ ఓదెలకు ఇది మొదటి సినిమా. అయినా సినిమా రిలీజ్ కాకముందే ఆయన ఫేమస్ అయ్యారు. సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ప్రచారం సాగుతోంది.

‘దసరా’ మూవీలో నానితో పాటు కీర్తి సురేశ్ నటించారు. ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికై హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఏనోటా విన్నా ‘చమ్కీల’ సాంగ్ వినిపిస్తోంది. ఇక సినిమా రిలీజైన తరువాత సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో వచ్చిన ఐదు సినిమాలను కలిపి ‘దసరా’ను తీశారన్న టాక్ వినిపిస్తోంది. కానీ మొత్తంగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’కు దగ్గరి పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు.

Dasara- Rangasthalam
Dasara- Rangasthalam

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ 30 మార్చి 2018లో రిలీజ్ అయింది. నాని ‘దసరా’ 30 మార్చి 2023లో థియేటర్లోకి వచ్చింది. అసలు విషయమేంటంటే ‘రంగస్థలం’ సినిమా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే శ్రీకాంత్ ఓదెల. ఈయనే ‘దసరా’ సినిమాకు డైరెక్టర్. అందుకే ‘దసరా’ సినిమాలో సుకుమార్ డైరెక్షన్ కూడా కొంత కనిపిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇక ఈ రెండు సినిమాలో ఒకే రోజులో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయన్న టాక్ వినిపిస్తోంద. అటు కలెక్షన్లలోనూ సంక్రాంతికి రిలీజైన సినిమాలను దాటేసిందని వినబడుతోంది. అందుకే ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper