Dasara Festival: తెలంగాణలో దసరా పండుగ అంటే ఉత్సాహం, ఆనందం, ఆతిథ్య సత్కారం అంతా ఒకటే. అలాంటి దసరా వేడుకల్లో వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేష్, సహన దంపతులు ఇటీవల తమ కూతురు సింధును నికిత్ అనే యువకుడికి వివాహం చేశారు. పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుండగా, దసరా పండుగకు కొత్త అల్లుడు, కూతురు ఇంటికొచ్చారు. అల్లుడు వచ్చిన పండుగ కావడంతో అత్తమామలు ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
సాంప్రదాయంగా ‘మొదటి దసరా అల్లుడు భోజనం’ ప్రత్యేకంగా చేయడం ఆ కుటుంబ సంప్రదాయం. అందుకే అల్లుడు నికిత్ కోసం 101 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశారు. పిండివంటలు, పాయసాలు, కూరలు, వేపుడు వంటలు అంటూ టేబుల్ మొత్తం రకాల రుచులతో కళకళలాడింది.
అయితే, సరదాగా నికిత్ అడిగాడు. “ఈ 101 వంటకాల్లో ఒక్కటి కూడా తగ్గకపోతే బాగానే ఉంది గానీ, ఒక వంటకం తగ్గితే ఏమిస్తారు?” అని. నవ్వుతూ అత్తమామలు సమాధానమిచ్చారు. “ఒక వంటకం తగ్గితే ఒక తులం బంగారం ఇస్తాం” అని అత్తామామలు సమాధానమిచ్చారు..
అల్లుడు కూడా అంతే చురుకుగా అన్ని వంటకాలను లెక్కపెట్టాడు. లెక్కేసి చూసేసరికి ఒక వంటకం నిజంగానే మిస్సయింది! మాట నిలబెట్టుకున్న అత్తమామలు వెంటనే ఒక తులం బంగారం ఇచ్చారు.
ఈ సంఘటన కుటుంబంలోనే కాదు, పట్టణమంతా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా “ఇలాంటిదే దసరా మజా!” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
దసరా పండుగ అనగానే పులిహోర, పాయసం, బంధుమిత్రులతో సరదా వాతావరణం.. ఇంతలో ఒక తులం బంగారం బహుమతిగా పొందిన అల్లుడు నికిత్ మాత్రం ఈ దసరాను జీవితాంతం మరచిపోలేడు!
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం
ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు, నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేసిన గుంత సురేష్, సహన దంపతులు
పెళ్లి తర్వాత… pic.twitter.com/l1zlHMtWBB
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025