Pushpa 2 Story: అసలు ‘పుష్ప: ది రూల్’ కథేంటి? సుకుమార్ ఇలా మార్చేశాడా?

Pushpa 2 Story: 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. తెలుగు లో కంటే కూడా ఈ చిత్రం ఇతర బాషలలో ఇరగదీసింది. ముఖ్యంగా హిందీ లో అయితే 50 రోజుల వరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. కేవలం హిందీ వెర్షన్ నుండే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు […]

Written By: Vicky, Updated On : April 5, 2023 12:46 pm
Follow us on

Pushpa 2 Story

Pushpa 2 Story: 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. తెలుగు లో కంటే కూడా ఈ చిత్రం ఇతర బాషలలో ఇరగదీసింది. ముఖ్యంగా హిందీ లో అయితే 50 రోజుల వరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. కేవలం హిందీ వెర్షన్ నుండే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఈ సినిమా.

నార్త్ లో అల్లు అర్జున్ కి అక్కడి స్టార్ హీరోలతో సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉండాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానుల దగ్గర నుండి, ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సుకుమార్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు అర్థం అవుతుంది.ప్రీ టీజర్ తోనే సుకుమార్ కథని రివీల్ చేసేసాడు.

ఈ ప్రీ టీజర్ ద్వారా సుకుమార్ చెప్పాలనుకున్న కథ ఏమిటంటే పుష్ప తో గొడవలు ఉన్న పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షికావత్ పుష్ప ఎర్ర చందనం బిజినెస్ మొత్తాన్ని మట్టి కరిపించి అతని పవర్ మొత్తం లాగేసుకొని జైలు పాలయ్యేలా చేస్తాడు. తిరుపతి జైలు లో వేసిన తర్వాత పుష్ప ని అనేక విధాలుగా టార్చర్ పెడుతారు.

Pushpa 2 Story

ఒకానొక సందర్భం లో పుష్ప తిరుపతి జైలు నుండి తప్పించుకుంటాడు, తప్పించుకున్న తర్వాత తానూ ఎవ్వరికి కనిపించకుండా తన ఉనికిని దాచేస్తాడు. పుష్ప ఎక్కడా అంటూ పోలీసులు అతని కోసం గాలిస్తాడు. వీళ్లందరినీ తట్టుకొని పుష్ప మళ్ళీ ఎలా రూల్ చేసాడు అనేదే సినిమా సబ్జెక్టు. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంది కదూ..!,ఇక సుకుమార్ టేకింగ్ మరియు ఆయన మార్క్ ట్విస్ట్స్ ఇవన్నీ చూస్తే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.