Pushpa 2: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పుష్ప 2 హవ కొనసాగుతుందనే చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ భారీ రేంజ్ లో బుక్ అయ్యాయి. ఇక బెనిఫిట్ షో మొదలుకొని మూడు రోజుల వరకు సినిమా టికెట్లు మొత్తం బుక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 వైబ్ అనేది భారీ రేంజ్ లో కొనసాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీ రేంజ్ లో చేపట్టి తమదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద కన్నేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముందుగా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేసి ఆ తర్వాత బాహుబలి సినిమా రికార్డు మీద కన్నెయ్యాలనే రీతిలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 1300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి భారీ సక్సెస్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పుష్ప 2 ముందుకు సాగుతుంది. ఇక వీలైతే లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయాలని చూస్తుంది. దాదాపు 2000 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిన బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును మాత్రం ఈజీగా బ్రేక్ చేస్తుందంటూ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అందుకే అల్లు అర్జున్ ఇలాంటి ఒక భారీ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతని స్ట్రాటజీ ఏంటో ఇప్పుడిప్పుడే సినిమా ప్రేక్షకులందరికి అర్థమవుతుంది. ఈ ఒక్క సినిమాతో కుంభస్థలాన్ని కొడితే ఆయన ఇండస్ట్రీలోనే కాదు. ఇండియాలోనే టాప్ హీరోగా ఎదుగుతాడనే విషయం అయితే అందరికీ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
మరి ఈ హైప్ ని వాడుకుంటూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం అల్లు అర్జున్ కెరియర్ కి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. మరి అంతటి విజయాన్ని ఈ సినిమా నమోదు చేస్తుందా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 5 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా వచ్చిన పీలింగ్స్ అనే సాంగ్ కూడా ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా యావత్ సినిమా అభిమానులందరిని ఉర్రుతలూగిస్తుందనే చెప్పాలి…