Viral Video
Viral Video : అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అప్పులు ఎక్కువ కావడం వల్ల పనికి కుదురుతాడు. ఓ గార్మెంట్ కంపెనీలో దుస్తులు అమ్ముడుపోకపోవడంతో ఆ కంపెనీ ఆర్థికంగా చితికిపోతుంది. ఆ కంపెనీలో ఉన్న దుస్తులను అమ్మి పెట్టే బాధ్యతను రాజేంద్రప్రసాద్ తీసుకుంటాడు. ముందుగా పాన్ పరాగ్ నమిలి దుస్తుల మీద ఉమ్మి వేస్తాడు. అది కొత్త ఫ్యాషన్ అంటూ ప్రచారం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని దుస్తులకు సిగరెట్ తో రంద్రాలు పెడతాడు.. ఫలితంగా ఆ దుస్తులు భారీగా అమ్ముడుపోతాయి.. రాజేంద్రప్రసాద్ కు డబ్బు కూడా విపరీతంగా వస్తుంది.. అదంటే సినిమా కాబట్టి.. అలా ఉంటుంది.. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా? అసలు సాధ్యమవుతుందా? అంటే ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వస్తోంది.
Also Read : ఖడ్గమృగం వెంటాడింది.. వాళ్లు జరసేపు అక్కడే ఉంటే.. వైరల్ వీడియో
ఫ్యాషన్ పేరుతో..
ప్రపంచం మొత్తం నేడు స్మార్ట్ ఫోన్ వెంట పరుగులు తీస్తోంది. అందులో ఏది కొత్తగా కనిపిస్తే దానినే ఫాలో అవుతోంది. దానికి ఫ్యాషన్ అని వంత పాడుతోంది. సాధారణంగా మనం ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మన అంతర్గత అవయవాలకు, బాహ్య అవయవాలకు రక్షణ కల్పించాలి. కానీ ఫ్యాషన్ పేరుతో అడ్డగోలుగా దుస్తులను రూపొందించి.. అంగాంగ ప్రదర్శన చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. సినిమాల్లో అయితే మరింత దారుణంగా మారింది. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఓ షాపింగ్ మాల్ లో దుస్తులను అమ్మకానికి ఉంచారు. అవన్నీ కూడా జీన్స్ వస్త్రానికి సంబంధించిన దుస్తులు. ఇది అవన్నీ కూడా చినిగిపోయి ఉన్నాయి. కొన్ని అయితే దారాల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. అసలు ఇలాంటి దుస్తులను ఎలా ధరిస్తారు? వాటిని ధరించి ఎలా బయటికి వెళ్తారు? చూసేవాళ్ళు నవ్వుకోరా? ఎగతాళి చేయరా? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. అలాంటి ప్రశ్నలు వేస్తే అసలు ఫ్యాషన్ కు అర్థమే లేదు. ఇలాంటి దుస్తులను మార్కెట్లోకి తెచ్చిన కంపెనీలను.. వాటిని విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు పెద్ద దండం పెట్టాల్సిందే. అన్నట్టు జంతువులు ఎటువంటి దుస్తులు ధరించవు. కానీ వాటి అంతర్గత అవయవాలను ఎప్పుడూ కూడా బయట పెట్టుకోవు. జంతువులతో పోలిస్తే జ్ఞానం, వివేకం, విచక్షణ ఉన్న మనుషులు మాత్రం దారుణంగా తయారవుతున్నారు. దాచుకోవాల్సిన వాటిని కనిపించేలా చేస్తున్నారు. పరువు పోగొట్టుకుంటూ జంతువులకంటే హీనంగా మారుతున్నారు. అన్నట్టు ఈ దుస్తులను యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. పైగా ఇలాంటి దుస్తులకు ఆయా వస్త్ర కంపెనీలు భారీగా ధరను నిర్ణయించి విక్రయిస్తున్నాయట. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో ఈ తరహా దుస్తులకు విపరీతమైన డిమాండ్ ఉందట. అందువల్లే యువత ఈ తరహా దుస్తులను ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే మనదేశంలో మెట్రోపాలిటన్ నగరాలలో ఇలాంటి దుస్తులకు విపరీతమైన గిరాకీ ఉందని షాపింగ్ మాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read : మ్యాచ్ లో మాత్రమే ప్రత్యర్థులు.. ఆ తర్వాత స్నేహితులు.. వీడియో వైరల్
రేయ్ ఎవర్రా మీరంతా … pic.twitter.com/fILM5UlOrR
— JSP Naresh (@JspBVMNaresh) March 26, 2025