Homeట్రెండింగ్ న్యూస్Viral Video: మా తల్లే.. వంకాయలను కూర కోసం వాడతారు.. నువ్వేంటమ్మా అందుకోసం ఉపయోగిస్తున్నావ్.. వైరల్...

Viral Video: మా తల్లే.. వంకాయలను కూర కోసం వాడతారు.. నువ్వేంటమ్మా అందుకోసం ఉపయోగిస్తున్నావ్.. వైరల్ వీడియో

Viral Video: వంకాయల్లో నల్లటివి, పచ్చ టివి అనే రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నల్ల వంకాయలు వేపుడు కూరగా బాగుంటాయి. పచ్చటి వంకాయలు గ్రేవీతో వండితే బాగుంటాయి. వంకాయలను ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా.. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తింటారు. ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాలలోని ప్రజలు వంకాయలతో పులుసు, పచ్చడి చేసుకొని తింటారు. వీటిని శీతాకాలం, వర్షాకాలం సమయాల్లో ఇష్టంగా తింటారు. వేసవికాలంలో వంకాయ పచ్చడి పెట్టుకుని తింటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వంకాయ మసాలా కూర విపరీతమైన ఫేమస్. పెళ్లిళ్ల సమయాల్లో వంకాయ వేపుడు తయారుచేసి అతిధులకు వడ్డిస్తుంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే వంకాయలతో వడియాలు చేసుకుని తింటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వంకాయ వడియాల తయారీ కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. ఇలా తయారు చేసిన వంకాయల వడియాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. తద్వారా మహిళలు ఉపాధి పొందుతుంటారు. గుంటూరు, కరీంనగర్, కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వంకాయల వడియాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం పొందిన వంకాయలను ఒక మహిళ మాత్రం వేరే పనికి వాడుకుంది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

సోషల్ మీడియా పిచ్చి పెరిగి..

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో.. కొంతమంది ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేస్తున్న పని మెప్పు పొందేదిగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అవ్వడానికి అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. అడ్డమైన పనులు చేస్తున్నారు. ఆ కోవలోకి ఈ మహిళ కూడా వస్తుంది. ఎందుకంటే ఆమె చేసిన పని అటువంటిది మరి. నాజుగ్గా, నలుపు, నీలం రంగు మిశ్రమంలో ఉన్న వంకాయలను చక్కగా వండుకోక.. ఓ మహిళ తన ఒంటికి కోకలాగా చుట్టుకుంది. చూస్తుంటే ఆదృశ్యం అత్యంత దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఆ మహిళ ఈ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.. Instagram లో sonpal అనే ఐడీలో ఓ వీడియో తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ చక్కగా దుస్తులు ధరించక.. చుట్టూ వంకాయలు వస్త్రాలుగా ధరించింది. ఆదర్శం చూస్తుంటే అత్యంత చండాలంగా ఉంది. ఆ వీడియోను చూసి ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ” అమ్మా తల్లీ వంకాయలను కూర కోసం వాడుకుంటారు.. నువ్వేంటి తల్లి దుస్తులు కరువై నట్టు.. వస్త్రాలు బరువైనట్టు.. వంకాయలను ఒంటికి చుట్టుకున్నావ్. ఇదేం దరిద్రం .. ఇదేం చండాలం” అంటూ దుయ్యబడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sonpal (@sonpal_24)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular