
అనసూయ ఆగ్రహించింది. ఉక్రోశం ఆపుకోలేక అందరిపై అరిచేసింది. కరోనా సెకండ్ వేవ్ వేళ ఓ వీడియోను రిలీజ్ చేసి ఊగిపోయింది.
కరోనా వేళ ఎవరికి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అనసూయ వాపోయింది. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ భారత్ లో ఇంతమందికి సోకడం వెనుక మన నిర్లక్ష్యం ఉందని అందరూ మాస్కులు పెట్టుకోవాలని అనసూయ ఊగిపోయింది.
ఇక తన ‘థాంక్యూ బ్రదర్’ మూవీ మే 7న ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతుందని.. దాన్ని అందరూ చూడాలని చివర్లో ట్విస్ట్ ఇచ్చింది.
మొత్తంగా అనసూయ ఆగ్రహం వెనుక సినిమా ప్రమోషన్ వీడియో ఉందన్న విషయం వెలుగుచూసింది. ఎంతైనా జబర్ధస్త్ యాంకర్ తెలివైన పనిచేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.