ఇటీవలే విడుదలైన ‘చావా’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనమంతా చూసాము. కేవలం హిందీ వెర్షన్ లోనే ఇప్పటి వరకు ఈ సినిమాకి 475 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ వారం లో కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్, వచ్చిన పాజిటివ్ టాక్ ని చూసి మన తెలుగు లో ఈ చిత్రానికి డిమాండ్ వేరే లెవెల్ లో పెరిగిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ ని గమనించిన నిర్మాత అల్లు అరవింద్, ఈ చిత్రాన్ని తెలుగు లో డబ్ చేసి ఈ నెల 7 న విడుదల చేయబోతున్నారు.
Also Read: ‘కడుపు మండిన కాకుల కథ’..దుమ్ములేపిన నాని ‘ది ప్యారడైజ్’ టీజర్..కానీ అవేమి బూతులు సామీ!
ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దీనికి మన ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ‘అయినవాళ్లను, కానివాళ్లను తొక్కుకుంటూ సాధించిన కిరీటం ఇది. మళ్ళీ దీనిని తొడుగుకునేది, ఆ పొగరుబోవు శంభాజీ ని చావు కేకలు విన్న తర్వాతే’ అంటూ ఔరంగజేబు డైలాగ్ చెప్పడం ఈ ట్రైలర్ హైలైట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. అదే విధంగా ట్రైలర్ చివర్లో హీరో విక్కీ కౌశల్ ‘నా చావు ప్రతీ ఒక్క ఇంట్లో ఒక కొత్త శివాజీ ని పుట్టించేలా చేస్తుంది. కానీ నీ చావు మాత్రం మొఘల్ సామ్రాజ్యం పతనానికి పునాది’ అంటూ ఔరంగజేబు తో చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది.
Also Read: నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
డైలాగ్స్ బాగానే ఉన్నాయి కానీ, హీరో పాత్రకు అందించిన వాయిస్ మాత్రం ఎందుకో అంచనాలకు తగ్గట్టుగా లేదని అనిపించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హీరో పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు అంటూ వార్త వచ్చింది. అల్లు అరవింద్ సారథ్యంలో డబ్బింగ్ జరుగుతుంది కదా, అది సాధ్యం అవ్వోచ్చేమో అని అందరూ అనుకున్నారు. కానీ సాధారణ డబ్బింగ్ ఆర్టిస్టు గా పని కానిచ్చేశారు. హిందీ లో విక్కీ కౌశల్ డైలాగ్స్ లో గాంభీర్యం ఉండేది. ఇక్కడ అదే మిస్ అయ్యింది. కానీ స్టోరీ ఓరియెంటెడ్ సబ్జెక్టు కాబట్టి ఆడియన్స్ ఇలాంటివి పట్టించుకోకపోవచ్చు. ఇకపోతే మార్చి 7 న తెలుగు లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలుగు వెర్షన్ నుండి కనీసం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ఫుల్ రన్ లో వస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్.