Highest Budget Indian Movies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్లకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఎంత పెద్ద టాప్ డైరెక్టరైన, స్టార్ హీరోలైనా కూడా సక్సెస్ లేకపోతే వారిని ఎవ్వరు పట్టించుకోరు… అందుకే స్టార్ హీరోలందరు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉంటున్నారు. అందుకే ఎవరు చేయనటు వంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇండియాలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఏంటి అంటూ కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
ప్రస్తుతం రణ్బీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీత గా నటిస్తున్న ‘రామాయన్’ సినిమానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు 3,000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా రెండోవ అతడి బడ్జెట్ ఈ సినిమాగా ఒక రికార్డ్ ను నమోదు చేసుకుంది.
ఇక దీని తర్వాత అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా 1000 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతుండటం విశేషం… ఇక ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ తో కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొడతాయనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక వీటిలో ఏ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.
తద్వారా ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసే సినిమాలు ఏవి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా దంగల్ సినిమా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో పుష్ప 2 సినిమా ఉండటం విశేషం… ఇక మూడో స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది…ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలతో ఈ లెక్కలు మారబోతున్నాయి…