Mega DSC: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. తొలి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేస్తానని ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) హామీ ఇచ్చారు. టీడీపీ(TDP) ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. దీంతో నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు టీడీపీకి అండగా నిలిచారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా డీఎస్సీ(DSC) ఊసే లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయడంతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఆశించారు. కానీ, నిరాశే మిగిలింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నత్తరాల సమయంలో పాఠశాలల ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్(Nara Lokesh) సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రహరీల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని, ఇందుకు మన బడి, మన భవిష్యత్ కార్యక్రమంలో పనులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారని తెలిపారు. 12 లక్షల మంది చదువుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో జీవో తెస్తామని తెలిపారు.
Also Read: జనసేన ప్లీనరీ కుదింపు.. సంచలన నిర్ణయం.. కారణాలు అవే!
జూన్‌లోగా భర్తీ..
లోకేశ్ ప్రకటన ప్రకారం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (Ded) లేదా బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులు (SC/ST/BC/PH వారికి 45%) అవసరం. అలాగే, AP TET 0r CTET వంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు!