Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) పరిస్థితి ని గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి పేరు ఎత్తితే గొప్ప రచయితా, గొప్ప నటుడు అనేవి మనకి గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన పేరు ఎత్తితేనే ఆయన గతంలో మాట్లాడిన భూతులే గుర్తుకు వస్తున్నాయి. వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఇతను వేసిన వేషాలను అంత తేలికగా జనాలు మర్చిపోలేరు. సభ్య సమాజం సిగ్గు పడేలా, చిన్న పిల్లలను ఆడవాళ్లను కూడా వదలకుండా, అత్యంత నీచంగా ఆయన మాట్లాడిన మాటలకు కచ్చితంగా శిక్ష పడితే బాగుంటుంది అని అందరూ కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఇతన్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు కానీ, ఆలస్యంగానే అరెస్ట్ చేసారు. ఇటీవలే హైదరాబాద్ లో ఉన్న పోసానిని అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు, రైల్వే కోడూరు కోర్టులో హాజరు పర్చగా, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
Also Read: ‘కడుపు మండిన కాకుల కథ’..దుమ్ములేపిన నాని ‘ది ప్యారడైజ్’ టీజర్..కానీ అవేమి బూతులు సామీ!
మధ్యలో ఆయన అస్వస్థతకు గురైనట్టు నాటకాలు ఆడాడని, మేము సమీపం లో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లి, అతనికి అవసరమయ్యే అన్ని వైద్య పరీక్షలు చేయించామని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని పోలీసులు మొన్న మీడియా కి తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు పోసాని మెడ చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగించుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదు అయ్యాయట. అందుకే ఆయనకోసం పీటీ వారెంట్లు పోలీసులు సిద్ధం చేస్తున్నారట. కాసేపటి క్రితమే రాజంపేట జైలు అధికారులకు నరసారావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు పీటీ వారెంట్లు అందచేశారట. దీంతో పోలీసులు పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారట. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి కులాల మధ్య చిచ్చు రేగే వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యాడు.
ఈ కేస్ లో ఆయనకు బెయిల్ కూడా రావొచ్చు. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), చంద్రబాబు(Cm Chandrababu Naidu), లోకేష్(Nara Lokesh) లపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన పై నమోదైన కేసుల నుండి తప్పించుకోవడం చాలా కష్టం అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూతుర్లను ఉద్దేశించి అత్యంత నీచమైన మాటలు మాట్లాడినందుకు ఆయనపై పోక్సో కేస్ కూడా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం జగన్ కూడా ఇక పోసానిని కాపాడలేదని, ప్రభుత్వం దయచూపించి వదిలేయాల్సిందే కానీ,లేకపోతే పోసాని పదేళ్లు జైలు శిక్ష అనుభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందో పోసాని కృష్ణ మురళి ఒక ఉదాహరణ. బహుశా ఆయన స్థాయిలో వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవ్వరూ చెయ్యలేరేమో, కనీసం ఆయన అలా రెచ్చిపోతున్నప్పుడైనా అప్పటి ముఖ్యమంత్రి జగన్ అతన్ని కంట్రోల్ లో పెట్టుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
Also Read: నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!