Homeక్రైమ్‌Valentine's Day 2026: మీ మొబైల్ కు వాలెంటెన్స్ డే మెసేజ్ వచ్చిందా..? అసలు నమ్మొద్దు..

Valentine’s Day 2026: మీ మొబైల్ కు వాలెంటెన్స్ డే మెసేజ్ వచ్చిందా..? అసలు నమ్మొద్దు..

Valentine’s Day 2026: రెండు హృదయాల కలయిక ప్రేమ. ప్రేమికులు సంతోషంగా ఉండడానికి వాలెంటెన్స్ డే ను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు ప్రత్యేకగా ఈరోజు భావిస్తారు. Saint Valentine అనే వ్యక్తి పేరు మీద వాలెంటైజ్ డే ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఒకప్పుడు ఈ రోజున ప్రేమికులంతా కలుసుకొని సంతోషంగా ఉండేవారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. కానీ ఇప్పుడు వ్యక్తుల మధ్య దూరం పెరిగింది. దీంతో ఆన్లైన్లో శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు ప్రేమ, బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ మోసాలు ఎలా ఉంటాయంటే?

Valentines Day సందర్భాన్ని కొందరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ లలో ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ మోసాలు ఎలా ఉంటాయంటే..? కొందరు నకిలీ డేటింగ్ ప్రొఫైలు సృష్టిస్తారు. వీటి ద్వారా యువతను వలలో వేసే ప్రయత్నం చేస్తారు. అందమైన ఫోటోలు, భావోద్వేగ మెసేజ్ లతో చాట్ ప్రారంభించి నమ్మకంగా ఉంటారు. ఆ తర్వాత డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా UPI ID , OTP వంటి మెసేజ్లు పంపుతూ ఉంటారు. వీటికి రియాక్ట్ అయితే బ్యాంకు ఖాతాలోని డబ్బు వెంటనే మాయమవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు యాప్స్ కు సంబంధించిన లింక్స్ పంపించి డౌన్లోడ్ చేయమని కోరుతారు. వీటిలో మాల్వేర్ ను ఉంచి.. ఆ యాప్ డౌన్లోడ్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు..

అలాగే ప్రముఖ ఈ కామర్ సంస్థల పేర్లు వాడుతూ నకిలీ మెసేజ్లు పంపిస్తారు. మీ గిఫ్ట్ డెలివరీలో ఉంది.. ట్రాక్ చేయండి.. అంటూ లింక్స్ పంపుతారు. దీనిపై క్లిక్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతాయి. అంతేకాకుండా ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమయ్యే అవకాశం ఉంటుంది. వాలంటైజ్ డే సందర్భంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ వలలో పడొద్దు అనుకుంటే వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వాలెంటెన్స్ డే సందర్భంగా ఎలాంటి లింకులపై క్లిక్ చేయకుండా ఉండాలి. అధికారిక వెబ్సైట్లు లేదా యాప్ ల ద్వారానే వస్తువులను ఆర్డర్ చేయాలి. ప్రత్యేకమైన ఆఫర్లు ఇచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించాలి. అనుమానస్పద యాప్ లను డౌన్లోడ్ చేయవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడమే మంచిది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే 1930 అనే హెల్ప్ నెంబర్ కు కాల్ చేయాలి. మోసం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే సైబర్ మోసాన్ని వెంటనే గుర్తించవచ్చు అని పోలీసులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
Oktelugu Epaper
Exit mobile version