Site icon OkTelugu

Apple Valentines Day offers: వాలెంటైన్స్ డే.. యాపిల్ కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ కూడా..

Apple Valentines Day offers

Apple Valentines Day offers

Apple Valentines Day offers: ప్రేమికుల దినోత్సవం రోజు తమ ప్రియమైన వారికి కానుకలు ఇస్తుంటారు. ఇప్పటి కాలం మొత్తం స్మార్ట్ పరికరాల చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. చాలామంది తమకి ఇష్టమైన వారికి డిజిటల్ ఉపకరణాలు.. స్మార్ట్ పరికరాలు కానుకలుగా అందిస్తుంటారు. స్మార్ట్ ప్రపంచంలో యాపిల్ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ధర ఎక్కువైనప్పటికీ వీటిని వాడటం చాలా మంది స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు.

ప్రేమికుల దినోత్సవం రోజున యాపిల్ కంపెనీ మనదేశ మార్కెట్లో తన ఉత్పత్తులకు సంబంధించి భారీ డిస్కౌంట్ ధర ప్రకటించింది. ఈ డిస్కౌంట్ లో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ పై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ సదుపాయం యాపిల్ అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.

వాలెంటైన్స్ డే అమ్మకాలలో భాగంగా యాపిల్ కంపెనీ ధరలను తగ్గించలేదు. కాకపోతే బ్యాంకు ఆధారిత క్యాష్ బ్యాక్.. క్రెడిట్ కార్డు ద్వారా డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు మొత్తం యాక్సెస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐసిఐసిఐ కార్డుల మీద వర్తిస్తాయని యాపిల్ కంపెనీ చెబుతోంది. అర్హత కలిగిన కార్డులను ఉపయోగించి డిస్కౌంట్ పొందాలని యాపిల్ కంపెనీ చెబుతోంది. ఇలా చేయడంవల్ల ఫోన్ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది. కొనుగోలు చేసే విషయంలో
.. డెలివరీలో.. ఇతర చెల్లింపు ఫీజులు యధావిధిగా ఉంటాయి.

డిస్కౌంట్ లభించే ఐఫోన్ 17 లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా xdr oled డిస్ప్లే లభిస్తుంది. ఇది yeh 19 chip, 8GB RAM, 256 GB/512 GB స్టోరేజీలో లభిస్తుంది. ఫోటోగ్రఫీలో కూడా ఇది అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఏకంగా 48 మెగాపిక్సల్ డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది టెన్ ఎక్స్ డిజిటల్ జూమ్ కు తోడ్పడుతుంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ ఫోన్ 77,900 ధరకు లభిస్తుంది. ఇనిస్టెంట్ క్యాష్ బ్యాక్ గా 5000 వస్తాయి.

ఐఫోన్ 17 ప్రో స్పెక్స్ ఆఫర్లు ఎలా ఉన్నాయంటే

ఐఫోన్ 17 ప్రో లో 6.3 అంగుళాల ltpo super retina xdr display ఉంటుంది. ఇది 120 Hz ప్రోమోషన్, ఆల్వేస్, ఆన్ అనే ఫీచర్ తో లభిస్తుంది. ఇందులో ఏ 19 ప్రో చిప్, 12జిబి ర్యామ్ ఉంటాయి. అలాగే 48 మెగాపిక్సల్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 8 కే సామర్థ్యంతో వీడియో రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కు టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. యుఎస్ బి సి పోర్ట్ తో లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధునాతనమైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. 33 గంటల వరకు బ్యాటరీ బ్యాక్అప్ ఉంటుంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ ఫోన్ 1,29,990 ధరకు లభిస్తుంది. ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ రూపంలో ఐదువేల వరకు వస్తాయి.

ఐఫోన్ 17 ప్రో మాక్స్

ఇందులో 6.9 అంగుళాల ఎల్టిపిఓ సూపర్ రెటీనా ఎక్స్ డి ఆర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120 హెచ్ జెడ్ ప్రో మోషన్ ఆల్వేస్ ఆన్ ఫీచర్ కలిగి ఉంటుంది. 3,000 నెట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఏ 19 ప్రో చీప్ అందుబాటులో ఉంటుంది. 12 జిబి రామ్ ఉండడంవల్ల శక్తివంతమైన పనితీరు కనబరుస్తుంది. ఇందులో 48 మెగాఫిక్సల్ కెమెరా సెటప్ ఉంటుంది. త్రిబుల్ కెమెరా సెట్ అప్ కావడంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఎల్ఐడిఎఆర్ సెన్సార్, 5x టెలిఫోటో జూమ్.. 8 కే క్వాలిటీతో వీడియోలు తీసుకోవచ్చు. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ ఫోన్ 1,44,990 రూపాయల దరకు లభిస్తుంది. దీనిపై ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ గా 5000 వరకు లభిస్తున్నాయి.

Exit mobile version