‘మల్లేశం’ సినిమాలో అనన్యను చూసినప్పుడు, అచ్చ తెలుగు బ్యూటీగా అనన్యకి గుడ్ నేమ్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన చూసిన దిల్ రాజు, ఆమెకు ‘వకీల్ సాబ్’లో అమాయక ఆదిలాబాద్ యువతిగా అవకాశం ఇచ్చి, ఆమెను నిలబెట్టడానికి బాగానే ప్రయత్నం చేసింది. అందుకు తగ్గట్టుగానే అనన్య కూడా చక్కగా మరింతగా పాపులర్ అయింది.
‘అనన్య నాగళ్ళ’ అని మన తెలుగు అమ్మాయే. చక్కగా నటిస్తోంది, మంచి నటి అంటూ ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే, ఎప్పుడైతే ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమెకు గుర్తింపు వచ్చిందో.. ఇక అప్పటి నుండి అనన్య డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తనకు హీరోయిన్ గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి హీరోయిన్ అన్నాక, ఎక్స్ పోజింగ్ చేయాలని అనన్య ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది.
అవసరం ఉన్నా లేకున్నా హాట్ ఫోటో షూట్ లు చేయడానికి తెగ ఉత్సాహ పడుతుంది. మరి ఈ బ్యూటీ మైండ్ సెట్ మొదటి నుండి ఇలానే ఉంటుందో.. లేక వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏమి చేస్తోందో తెలియకుండా ఎక్స్ పోజింగ్ చేసేస్తూ.. మొత్తానికి అనన్య కమర్షియల్ హీరోయిన్ లా తన పద్దతిని మార్చుకుంటూ పోతుంది.
కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమాలకు బ్రేక్ పడింది. ఈ ఖాళీ టైంలో ఇన్ స్టాగ్రామ్ లో అనన్య తెగ హల్ చల్ చేస్తోంది. తనకు సంబంధించిన లెటెస్ట్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ హాఫ్ సారీలో కనిపింంచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వకీల్ సాబ్ లో పేద యువతిగా, సాంప్రదాయంగా కనిపించిన అనన్య ఒక్కసారిగా ఇలా అందాలు ఆరబోయడం చూసి ఫ్యాన్స్ కు దిమ్మదిరిగిపోయింది.
‘వకీల్ సాబ్’ సినిమా తరువాత అనన్య ప్లేబ్యాక్ సినిమాలో నటించింది. ఇక సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. మరో రెండు ప్రాజెక్టులు ఈ భామ చేతిలో ఉన్నాయట. మొదట్లో రానీ గుర్తింపు ‘వకీల్ సాబ్’ సినిమాతో రావడంతో అనన్య తగ్గేదు లేదంటూ అంటూ సోషల్ మీడియాలో క్లీవేజ్ షోతో తాజాగా రచ్చ చేసింది. పద్ధతి అయిన హీరోయిన్ ఇలా కనిపించడంతో నెటిజన్లు ‘నువ్వు హాట్ ’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.