జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర?

వైసీపీలో భయం పుట్టుకొస్తోంది. టీడీపీ అధికారం హస్తంగతం చేసకుంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు అసెంబ్లీలో 151 సీట్ల బలం ఉన్నా టీడీపీ చేష్టలతో నిత్యం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ ప్రోత్సాహంతోనే రెచ్చిపోయాడనే వైసీసీ నాయకులు చెబుతున్నారు. పార్టీని అస్థిర పరచేందుకు టీడీపీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. న్యాయవ్యవస్థతో కూడా వైసీపీ ఒక సందర్భంలో పేచీ పెట్టుకుంది. అప్పట్లో వరుస పెట్టి […]

Written By: Srinivas, Updated On : June 3, 2021 10:58 am
Follow us on


వైసీపీలో భయం పుట్టుకొస్తోంది. టీడీపీ అధికారం హస్తంగతం చేసకుంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు అసెంబ్లీలో 151 సీట్ల బలం ఉన్నా టీడీపీ చేష్టలతో నిత్యం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ ప్రోత్సాహంతోనే రెచ్చిపోయాడనే వైసీసీ నాయకులు చెబుతున్నారు. పార్టీని అస్థిర పరచేందుకు టీడీపీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

న్యాయవ్యవస్థతో కూడా వైసీపీ ఒక సందర్భంలో పేచీ పెట్టుకుంది. అప్పట్లో వరుస పెట్టి కోర్టు తీర్పులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వచ్చేవి. దీంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీదనే జగన్ లేఖాస్ర్తం ప్రయోగించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్ర సాగుతోందని పేర్కొన్నారు.తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థంకాని పరిస్థితి.

దీనికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి రఘురామ మాటలు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు పాచికలు పారవని కొట్టిపారేస్తున్నారు. వైసీపీకి బలమైన నాయత్వం ఉందని గుర్తు చేస్తున్నారు.

రఘురామ కృష్ణం రాజుతో జగన్ బెయిల్ పిటిషన్ రద్దు కోసం పిటిషన్ వేయిస్తే ఇద్దరి మధ్య రగులుకున్న మంటల్లో ప్రభుత్వం అస్థిరపడడంతో రాష్ర్టపతి పాలన వచ్చే అవకాశముందని టీడీపీ భావించింది. అందుకు అనుగుణంగా పావులు కదిపినా పాచిక పారలేదు. దీంతో వారు ప్రభుత్వాన్ని నిందించే పనిలో పడ్డారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు