https://oktelugu.com/

ఇక క్రికెట్ హీట్: ఇంగ్లండ్ కు టీమిండియా

కరోనా లాక్ డౌన్ ఆగిపోయిన క్రీడలను మళ్లీ పట్టాలెక్కించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఇప్పటికే క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడడంతో ఐపీఎల్ ను అర్ధాంతరంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్ కు టీమిండియాను పంపించింది. ఇది ముగిశాక ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను కూడా భారత్ ఆడనుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల జట్లు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2021 / 12:11 PM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ ఆగిపోయిన క్రీడలను మళ్లీ పట్టాలెక్కించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఇప్పటికే క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడడంతో ఐపీఎల్ ను అర్ధాంతరంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్ కు టీమిండియాను పంపించింది. ఇది ముగిశాక ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను కూడా భారత్ ఆడనుంది.

    నిన్న రాత్రి ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల జట్లు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లాయి. రెండు వారాలుగా వీరంతా ముంబైలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన బయో బబుల్ లో రెండు జట్లు కుటుంబ సభ్యులతో ఉన్నాయి. క్వారంటైన్ ముగియడంతో రెండు జట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఫైట్ ఎక్కాయి. బీసీసీఐ ఈ ఫొటోలను ట్విట్టర్ లో పంచుకుంది.

    పురుషుల టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ తోపాటుస్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జులన్ గోస్వామి మాస్కులు ధరించి ఫ్లైట్ ఎక్కారు. ఇక కోహ్లీ-అనుష్కశర్మ తమ కూతురుతో కలిసి ఎయిర్ పోర్టు దగ్గర ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి.

    కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ తో మొదట ఈనెల 18-22 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పైనల్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు 2ట్వంటీల్లో తలపడుతుంది.

    పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో రెండు జట్లకు సమాన అవకాశాలున్నాయని తెలిపాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. ఏటీం మెరుగ్గా ఆడితే చాంపియన్ షిప్ వారిదేనన్నాడు.