Troll Of The Day: ప్రతిపక్షంలో ఉన్నంత సేపు ప్రజాస్వామ్యం బతకాలంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలంటారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టాలంటారు. ప్రతిపక్షంలో ఉన్నంత సేపు ప్రజాస్వామికవాది, మానవతావాది. అధికారం రాగానే నియంత పోకడలు. సభలూ, సమావేశాలూ రోడ్ల పై పెట్టొద్దంటారు. ఖాళీ స్థలాల్లో పెట్టమని ఉచిత సలహాలిస్తారు. లేదంటే పోలీసు నిర్భందాలే. లాఠీల దెబ్బలే. నేటి ఏపీ పాలకుల తీరు బ్రిటీషోళ్లను తలదన్నేలా ఉంది. ఏపీలోని చీకటి జీవో పై స్పెషల్ ఫోకస్.

ఏపీలో రోడ్ల పై సభలు, సమావేశాల నిషేధం పై ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్ యాక్ట్ కు లోబడే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. జీవో నెంబర్ 1 పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. రోడ్ల పై సభలు, సమావేశాలకు అనుమతి ఉందని, అది షరతులతో కూడిన అనుమతి అని పోలీసులు చెప్పారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపాలిటీ రోడ్ల పై సభలకు పోలీసు అనుమతి తీసుకోవాలన్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తీరు చూస్తే.. ప్రతిపక్షాలకు ఓ న్యాయం. అధికార పార్టీకి ఓ న్యాయం అన్నట్టు ఉంది. జీవో నెంబర్ 1 తెచ్చాకే వైసీపీ సభలు, ర్యాలీలు నిర్వహించింది. దానికి వివరణ అడిగితే పోలీసు అనుమతి మేరకు నిర్వహించారని చెబుతారు. అదే ప్రతిపక్ష పార్టీ అడిగితే అనుమతి లేదంటారు. ఇదే కదా జరిగేది. ప్రతిపక్షాలకు జీవో నెంబర్ 1 రూల్ అయితే అధికార పార్టీ ఆ రూల్ కి ఉన్న మినహాంపును వాడుకుని సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఇది రాజకీయ ఉద్దేశంతో తీసుకొచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది.
సభలూ, సమావేశాలకు అనుమతి తీసుకోవాలంటున్న ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి పూజలు, వారాహి యాత్రను అడ్డుకోవడానికి జీవో నెంబర్ 2 తెస్తుందేమోనని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత సేపు ప్రజాస్వామికవాదిలా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. పాలకులు ప్రతిపక్షంలో ఉన్నంత సేపు స్వేచ్చా పిపాసుల్లా.. అధికారంలోకి రాగానే నియంతలా వ్యవహరిస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది.