Communist-Congress in Tripura : ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా బీజేపీ భావిస్తోంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ గెలవాలి ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి.
త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది. త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు బీజేపీకి అక్కడ ఒక్క శాతం కూడా ఓట్లు ఉండేవి కాదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి.
2018లో విప్లవ్ దేవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయన పనితీరు బాగాలేదని కొంతకాలానికి దింపేసి మాణిక్ సాహాను సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. ఆయనను కూడా కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే.. హోరాహోరీ పోరు ఉంటుంది. బీజేపీకి ఎదురీతేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్రిపురలో బీజేపీ వ్యతిరేకంగా కమ్యూనిస్టు – కాంగ్రెస్ ఐక్య సంఘటనగా ఏర్పడింది. ఈ క్రమంలోనే త్రిపురలో బీజేపీ గెలుస్తుందా? లేదా కమ్యూనిస్టు-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.