Arjun Das: సౌత్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకడు అర్జున్ దాస్.. కార్తీ హీరో గా నటించిన ‘ఖైదీ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా ద్వారా కూడా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.. గంభీరమైన గొంతు , అద్భుతమైన నటనతో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు.. తెలుగులో ఈయన నేరుగా నటించిన ఏకైక సినిమా గోపీచంద్ ‘ఆక్సిజన్’ చిత్రం..ఎక్కువగా ఇతను తమిళ సినిమాల్లోనే నటించాడు.. కేవలం ఈ ఒక్క ఏడాది లోనే 7 సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న అర్జున్ దాస్ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం.

-బాల్యం విద్యాభ్యాసం:
అర్జున్ దాస్ 1990వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున చెన్నై లో జన్మించాడు.. చిన్నప్పటి నుండి అర్జున్ దాస్ చదువులో నెంబర్ 1గా ఉంటూ వచ్చేవాడు.. కానీ సినిమాలంటే పిచ్చి.. తనని తాను ఎప్పటికైనా వెండితెర మీద చూసుకోవాలని కలలు కనేవాడు..కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా చదువు మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు.. తన టాలెంట్ తో ఏకంగా ఏకంగా దుబాయిలోనే బ్యాంక్ జాబ్ సంపాదించాడు.. లక్షల్లో జీతం.. కుటుంబం లో ఉన్న సమస్యలన్నీ చక్కబెట్టిన తర్వాత అతను నటుడు అవ్వాలనే కలను నెరవేర్చుకునేందుకు తిరిగి చెన్నై కి వచ్చాడు.
సినిమాల్లోకి వచ్చే ముందు అర్జున్ దాస్ చాలా బరువు ఉండేవాడు.. అతని ఆకారం చూసి ఎవరైనా ‘వామ్మో ఏంటి ఇతను ఇంత లావు ఉన్నాడు’ అని కామెంట్ చేసేవారట..అయితే సినిమాల్లోకి రావాలనే కసి అతనిని 32 కేజీలు తగ్గేలా చేసింది..అలా సినిమాల్లో అవకాశాల కోసం వందల కొద్దీ ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత పెరుమాన్ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం దక్కింది.. అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను తొలి సినిమాతోనే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మ్యాగజైన్ లో తన గురించి ప్రత్యేకంగా రాసారు.. తొలి సినిమాతో ఇలాంటి గుర్తింపు బహుశా ఇండియాలో ఏ నటుడికి దక్కి ఉండకపోవచ్చు..ఆ సినిమా తర్వాత అర్జున్ దాస్ కి అవకాశాలు ఆశించిన స్థాయిలో అయితే రాలేదు.
-ఖైదీ చిత్రంతో కీలక మలుపు :
అలా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయం లో ‘ర్యాండమ్ నంబర్స్’ అనే షార్ట్ ఫిలింలో నటించే అవకాశం దక్కింది.. ఏదో టైం పాస్ కోసం చేసిన ఈ షార్ట్ ఫిలిం అర్జున్ దాస్ కెరీర్ ని మార్చేసింది.. అప్పుడే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కార్తీతో ఖైదీ సినిమా తియ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు.. ఆ సమయంలో విలన్ పాత్ర కోసం కొత్తవాళ్ళని పెట్టుకుంటేనే బాగుంటుంది అనుకుంటున్న లోకేష్ కి అర్జున్ దాస్ ఆ షార్ట్ ఫిలిం ద్వారా తారసపడ్డాడు.. వెంటనే అర్జున్ కళ్యాణ్ ని కలిసి అతనికి ఈ పాత్ర ని వివరించి ఒప్పించాడు.. హీరో అవుదామని ఇండస్ట్రీ కి వచ్చిన అర్జున్ దాస్ కి ఇలా విలన్ రోల్ చేస్తే తన కల నెరవేరదేమో అనే భయంతో ముందుగా ఆ సినిమా ఒప్పుకోవడానికి కాస్త సంశయించాడు.. కానీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో తనని తాను ఒప్పించుకొని ఆ సినిమా చేసాడు.. అది ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ నేడు సౌత్ లోనే టాప్ మోస్ట్ క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరిగా మారిపోయాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో 7 సినిమాలు ఉన్నాయి..అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ అవ్వడమే విశేషం..లేటెస్ట్ గా ఆయన కీలక పాత్రలో తెలుగులో చేసిన ‘బుట్ట బొమ్మ’ అనే సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇది అర్జున్ దాస్ కి రెండవ సినిమా.. గతంలో ఆయన గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆక్సిజన్’ సినిమాలో గోపీచంద్ కి తమ్ముడిగా నటించాడు..ఆ తర్వాత ఆయన తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారానే మనకి పరిచయం అయ్యాడు.
-స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం:
ఇది ఇలా ఉండగా అర్జున్ దాస్ ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ తో ప్రేమాయణం నడుపుతున్నాడని లేటెస్ట్ గా సోషల్ మీడియా ని ఊపేసిన న్యూస్.. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది..ఐశ్వర్య లక్ష్మీ రీసెంట్ గానే విష్ణు విశాల్ హీరో గా తెరకెక్కిన ‘మట్టి కుస్తీ’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ వెండితెరకి పరిచయమైంది..ఇది మాత్రమే కాకుండా ఆమె అమెజాన్ ప్రైమ్ లో తెరకెక్కిన ‘అమ్ము’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఐశ్వర్య.. అయితే ఆమె అర్జున్ దాస్ తో కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నటించలేదు..అయినా కానీ వీళ్లిద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.