CM KCR- Governor Tamilisai: కొన్ని శత్రుత్వాలు ఏర్పడేందుకు కారణం ఉండదు. కొన్ని మిత్రుత్వాలు కలిసేందుకు మాత్రం కారణం ఉంటుంది.. మొన్నటిదాకా ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య వైరం ఉండేది.. ఉప్పు, నిప్పులాగా వ్యవహారం ఉండేది.. ప్రభుత్వం జారీ చేసిన బిల్లులను గవర్నర్ వివరణ అడిగేవారు.. గవర్నర్ రాష్ట్రంలో పర్యటిస్తే ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వం నిరసన తెలిపేది.. ఇలాంటివి గత ఏడాదిన్నర చోటు చేసుకుంటూ ఉన్నాయి.. ఫలితంగా మీడియాకు కావాల్సిన స్టఫ్.. ఇదే సమయంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక శాసన వ్యవస్థ పరస్పరం ఢీ కొంటే ఎంతటి ప్రమాదమో కెసిఆర్, తమిళి సై ఉదంతాలు నిరూపించాయి. ఇలాంటి సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక పొలిటిషన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో మనం చూసాం.. ఇలాంటివి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.. ఇప్పుడు గవర్నర్, కేసీఆర్ అన్నా చెల్లెలు లాగా కలిసిపోయిన నేపథ్యంలో మరి కౌశిక్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.

నిన్న బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గవర్నర్ అసెంబ్లీకి వచ్చారు.. ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్కొని వచ్చారు.. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఆమెకు సాదర స్వాగతం పలికారు.. ఆమె తొలిసారిగా గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏ స్థాయి గౌరవం లభించిందో.. నిన్న ఆ స్థాయి గర్వం ఆమెకు దక్కింది.. అఫ్కోర్స్ ఈ గౌరవం కోసం ఆమె కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది.. గవర్నర్ ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిన తర్వాత.. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కెసిఆర్ కు తత్వం బోధపడలేదు.. వాస్తవానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాజ్యాంగ వ్యవస్థలకు అనేక హక్కులు ఉన్నాయి.. వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ యధావిధిగా చదివారు.. ఇదే సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఆమె కితాబు ఇచ్చారు.. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పై ఎటువంటి విమర్శలు చేయకుండా గవర్నర్ ప్రసంగం కాపీని ప్రభుత్వం రూపొందించడం విశేషం.. అయితే దీని వెనుక గవర్నర్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది.. ఫలితంగా నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు అటు ప్రగతి భవన్, ఇటు రాజ్ భవన్ మధ్య వైరాన్ని తగ్గించాలని విశ్లేషకులు చెబుతున్నారు.. కొంతమంది మాత్రం పైకి నవ్వులు చిందిస్తున్నా… లోపల కత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.. ఎవరి వెర్షన్ వారికి ఉన్నప్పటికీ.. నిన్న కెసిఆర్, తమిళి సై అలా నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.