Tarakaratna Treatment: తారకరత్నను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. తారకరత్న అనారోగ్యానికి గురై వారం రోజులు అవుతుంది. జనవరి 27 నుండి ఆయన వెంటిలేటరపై ప్రాణాలతో పోరాడుతున్నారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి తారకరత్న ఆరోగ్యం మెరుగయ్యేలా చేశారు. అయితే తారకరత్న ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదు. గుండె, కిడ్నీ, లివర్ వంటి ప్రధాన అవయవాలు సాధారణ స్థితికి వచ్చాయి. మెదడులో మాత్రం సమస్య ఏర్పడింది.

తారకరత్న మెదడుకు 45 నిమిషాల పాట రక్తప్రసరణ అందలేదు. కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న గుండె కొన్ని నిమిషాల పని చేయలేదు. ఈ సమయంలో మెదడుతో పాటు అన్ని శరీర భాగాలకు రక్తం అందలేదు. ఈ కారణంగా ఆయన శరీరం నీలం రంగులోకి మారింది. ఈ కారణంగా తారకరత్న మెదడులో కొంత భాగం దెబ్బతింది. వాపు ఏర్పడడంతో పాటు నీరు చేరినట్లు సమాచారం. ఇంకా మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. హృదయ సంబంధిత నిపుణులతో పాటు పలు విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన టీం ఆయన ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తారకరత్న ట్రీట్మెంట్ కి కోటి రూపాయలకు పైగా ఖర్చుచేశారట. ఈ మొత్తం నారా చంద్రబాబు ఫ్యామిలీ భరిస్తునట్లు సమాచారం. తారకరత్న కుటుంబానికి అంత స్థోమత లేదు. నటుడిగా తారకరత్న హీరోగా సంపాదించింది ఏమీ లేదు. తండ్రి మోహన్ కృష్ణ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో నారా ఫ్యామిలీ తారకరత్న వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తున్నారట.

ఎలాగైనా తారకరత్నను బ్రతికించుకోవాలని నిర్ణయించుకున్న నందమూరి కుటుంబం మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో లోకేష్ పాల్గొన్నారు. అదే రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కార్డియాక్ అరెస్ట్ తో అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుప్పంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించారు.