సాధారణంగా జలపాతం ఎక్కడైనా ముందుకు పరుగులు తీస్తుంది. ఎవరైనా జలపాతం వెనక్కు వెళుతుందని చెబితే నవ్వుతారు. కానీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాత్రం జలపాతం వెనక్కు వెళుతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆస్ట్రేలియాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి వరదలు, వర్షాలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?
ఈ క్రమంలో సిడ్నీ నగరంలోని జలపాతంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. నగరంలో ఉన్నరెండు జలపాతాల్లోని నీళ్లు వెనక్కు పారాయి. నీళ్లు వెనక్కు పారుతున్న దృశ్యాలను చూసిన నెటిజన్లు గతంలో తాము ఎప్పుడూ ఇలాంటి వింతను చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. వెనక్కు వెళుతున్న జలపాతాల వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొందరు నెటిజన్లు ఈ జలపాతాలలా కాలం కూడా వెనక్కు వెళితే బాగుంటుందని చమత్కరిస్తున్నారు.
Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!
రాయల్ నేషనల్ పార్క్ లోని కొండ చరియ దగ్గర ఉన్న జలపాతాలలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండగా జలపాతాలు రివర్స్ లో పారుతుండటం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలకు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. నిపుణులు మాత్రం కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల జలాపతం పైకి పారుతుందని చెబుతున్నారు.