https://oktelugu.com/

రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

మన దేశంలో రోడ్ల పక్కన ఎక్కువగా రేగు పండ్ల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంగు రేను పండ్లను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇండియా, చైనా దేశాల్లో ఎక్కువగా పండే ఈ పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లు చైనా, ఇండియా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఈ పండ్లకు డిమాండ్ అంతకంతకూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 15, 2020 8:37 am
    Follow us on

    మన దేశంలో రోడ్ల పక్కన ఎక్కువగా రేగు పండ్ల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంగు రేను పండ్లను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇండియా, చైనా దేశాల్లో ఎక్కువగా పండే ఈ పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లు చైనా, ఇండియా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి.

    ఆస్ట్రేలియాలో ఈ పండ్లకు డిమాండ్ అంతకంతకూ పెరిగింది. దీంతో అక్కడి రైతులు సైతం రేగు పండ్ల సాగును మొదలుపెట్టారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల పంట కొనుగోళ్లు ఎక్కువగా జరగడం లేదు. పండ్లు డ్యామేజ్ అవుతూ ఉండటంతో ఏం చేయాలో రైతులకు అర్థం కాలేదు. కానీ బెన్ అనే రైతు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. డ్యామేజ్ అయిన పండ్లను పులియబెట్టి ఆ పండ్లతో బీర్ తయారు చేయాలని భావించాడు.

    ఈ ప్రతిపాదనతో రైతు ఒక మద్యం కంపెనీని సంప్రదించగా రేగు పండ్లతో బీరు సాధ్యం కాదని వాళ్లు రైతుకు చెప్పారు. కానీ బెన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా రుచికరమైన బీరును తయారు చేశాడు. డార్క్ కలర్ లో కనిపిస్తున్న బీరు ఎంతో రుచిగా ఉండటంతో మార్కెట్ లోకి ఈ బీరును రిలీజ్ చేసేందుకు మద్యం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రేగు పండ్ల బీర్ గురించి వార్తలు వైరల్ కావడంతో రేగు పండ్ల పంటకు అక్కడ భారీగా డిమాండ్ పెరిగింది.