ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాలలో వ్యక్తపరిచాడు. ఇక ఆయన దర్శకత్వంలో తారక్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ సినిమాలో తారక్ కోసం చరణ్ పాత్రను తగ్గించబోతున్నాడట. రాజమౌళి మొదట 2 గంటల 50 నిముషాలు ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం ఒక ఇరవై నిముషాలు పాటు సినిమా లెంగ్త్ ను తగ్గించాలకుంటున్నట్లు తెలుస్తోంది. […]

Written By: admin, Updated On : August 15, 2020 10:19 am
Follow us on


జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాలలో వ్యక్తపరిచాడు. ఇక ఆయన దర్శకత్వంలో తారక్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ సినిమాలో తారక్ కోసం చరణ్ పాత్రను తగ్గించబోతున్నాడట. రాజమౌళి మొదట 2 గంటల 50 నిముషాలు ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం ఒక ఇరవై నిముషాలు పాటు సినిమా లెంగ్త్ ను తగ్గించాలకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇరవై నిముషాల కటింగ్ లో చరణ్ పార్ట్ నే ఎక్కువ ఉంటుందట. ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని, దాంతో ఎన్టీఆర్ సీన్స్ తీసేయడానికి జక్కన్న ఇష్టపడట్లేదని.. పైగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా కూడా రాజమౌళి ఎన్టీఆర్ సీన్స్ ను టచ్ చేయట్లేదనేది తాజాగా వినిపిస్తోన్న గాసిప్.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

మొదటి నుండి ఎన్టీఆర్ ని సినిమాలో బాగా హైలైట్ అయ్యేలా రాజమౌళి చూసుకుంటున్నాడని.. అందులో భాగంగానే ఇప్పుడు తప్పనిసరి పరిస్తతుల్లో అంటూ చరణ్ కి చెప్పి.. చరణ్ సీన్స్ లో కొన్ని సీన్స్ ను కట్ చేయనున్నారు. అలా చేస్తే.. చరణ్ పాత్ర సినిమాలో ప్రేక్షక పాత్రగా మిగిలిపోతుందా అనే భయంతో టెన్సన్ పడుతున్నారు ఈ విషయం తెలిసిన మెగా సన్నిహితులు. మొత్తానికి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం, చరణ్ హీరోయిజాన్ని తగ్గించబోతుంది అన్నమాట. మరి చివరికి రాజమౌళి ఏమి చేస్తాడో… అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ కూడా రాజమౌళి తీసుకున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా విదేశీ భామను ఫైనల్ చేసి.. ఇక రెండో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ భామను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు, వైఎస్‌ఆర్ స్నేహం+వైరం= ఇంద్రప్రస్థం

సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందని.. ఆ పాత్ర కేవలం గెస్ట్ రోల్ లాంటిదని.. ఆ గెస్ట్ రోల్ లోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది. ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్ హైలెట్ గా ఉంటాయట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కొమరం భీం గొప్ప తనాన్ని ధైర్యాన్ని ఎలివేట్ చేస్తోందట.కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరోనాతో పోరాడుతున్నారు.