
Temper Re Release: ప్రతీ శివరాత్రికి జాగారం కోసం ప్రేక్షకులు మరియు అభిమానుల కోసం థియేటర్స్ లో ప్రత్యేక షోస్ ని ఏర్పాటు చేస్తూ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్.ఈ ఏడాది కూడా అదే జరగబోతుంది.ముఖ్యంగా హైదరాబాద్ సిటీ మొత్తం స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రీ రిలీజ్ లతో కళకళలాడిపోతుంది.టెంపర్, పుష్ప, సరిలేరు నీకెవ్వరూ, భీమ్లా నాయక్ , అఖండ , బిల్లా మరియు రెబెల్ వంటి సినిమాలను ప్రదర్శించబోతున్నారు.
వీటిల్లో టెంపర్ చిత్రానికి మినహా మిగిలిన ఏ సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేవు.ముఖ్యంగా హైదరాబాద్ లో సినిమాలకు కేంద్ర నిలయమైన RTC క్రాస్ రోడ్స్ లో టెంపర్ చిత్రాన్ని దేవి థియేటర్ లో 12 గంటల ఆటకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.దీనితో వెంటనే సంధ్య కంప్లెక్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు, అక్కడ కూడా దాదాపుగా టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి.
‘టెంపర్’ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకి మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.మిగిలిన థియేటర్స్ లో ఉన్న సినిమాలేవీ కూడా RTC క్రాస్ రోడ్స్ లో లేకపోవడం వల్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.అయితే పవన్ కళ్యాణ్ ‘జల్సా’ లేదా ‘ఖుషి’ చిత్రాలలో ఎదో ఒకటి శివరాత్రి రోజు వెయ్యడానికి అభిమానులు ప్రయత్నిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోలేక మీ సినిమాలకు థియేటర్స్ ఇస్తే డ్యామేజ్ చేస్తారు, మీకు షోస్ ఇవ్వము అంటూ RTC క్రాస్ రోడ్స్ థియేటర్స్ యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు.కానీ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ షోస్ పడే అవకాశం ఉంది,దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.ఈ పాత సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా శివరాత్రి నాడు స్పెషల్ షోస్ గా ప్రదర్శించబోతున్నారు ఫ్యాన్స్.