
Pawan Kalyan – Mani Ratnam: మన టాలీవుడ్ లో ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం, అది హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం వంటివి చాలా సాధారణంగానే జరుగుతూ వచ్చాయి.అలా పవన్ కళ్యాణ్ విషయం లో చాలానే జరిగాయి.ఇది వరకు ఆయన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, పోకిరి , అతడు, గోలీమార్, గజినీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్ కూడా సరిపోదు, అన్ని ఉంటాయి.ఇవన్నీ ఆన్ ది రికార్డు లో ఆయన వదులుకున్న సినిమాలే.
ఆఫ్ ది రికార్డు లో పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాల లిస్ట్ ఇంకా చాలా పెద్దది.వాటిల్లో మణిరత్నం ప్రాజెక్ట్ కూడా ఒకటి, ఈయన తో సినిమాలు చెయ్యడం ప్రతీ స్టార్ ఒక కలగా భావిస్తాడు, అలాంటిది పవన్ కళ్యాణ్ చేతులారా ఒక బంగారం లాంటి సినిమాని వదులుకున్నాడు.ఆ సినిమా పేరే ‘యువ’.సూర్య , మాధవన్ , సిద్దార్థ్ , త్రిష మరియు మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆరోజుల్లో సౌత్ ని ఒక ఊపు ఊపేసింది.
అయితే ఈ సినిమాలో సూర్య పోషించిన పాత్ర కోసం తొలుత పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట, కానీ అప్పటికే ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో ఈ సినిమాకి చెయ్యలేకపోయాడట, మణిరత్నం లాంటి లెజండరీ దర్శకుడితో సినిమా చేసే అవకాశం మిస్ అయ్యినందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడట.

వాస్తవానికి ఆ పాత్ర పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతగానో నచ్చిందట, ఆయన భావజాలం మరియు సిద్ధాంతాలకు తగట్టుగా ఆ పాత్ర ఉండడం తో ఆ చిత్రం చెయ్యడానికి సుముఖం గా ఉన్నప్పటికీ , డేట్స్ సమస్య వాళ్ళ వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.ఆరోజుల్లో ఈ సినిమా హీరో సూర్య కి కేవలం తమిళం లో మాత్రమే కాదు,తెలుగు లో కూడా మంచి మార్కెట్ ని తెచ్చిపెట్టింది.హిందీ లో ఈ సినిమాని అజయ్ దేవగన్ మరియు అభిషేక్ బచ్చన్ చేశారు, అక్కడ కూడా ఈ చిత్రం పెద్ద హిట్టే.