https://oktelugu.com/

Tomato Price Hike : టమాటాతో రూ.3 కోట్లు.. ఈయన పంట పండింది పో

పుణే జిల్లా జున్నర్ తాలుకా పచ్ గడ్ గ్రామానికి చెందిన టమాటా రైతు ఈశ్వర్ గైకార్ నెలసరి ఆదాయం అక్షరాలా రూ.3 కోట్లు. ఎప్పుడు నష్టాలు చవిచూసే ఈశ్వర్ టమాటా కొరత పుణ్యమా అని కోట్ల రూపాయల ఆదాయాన్ని కళ్లచూశాడు.

Written By:
  • Dharma
  • , Updated On : July 20, 2023 / 04:40 PM IST
    Follow us on

    Tomato Price Hike : టమాటా సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. ట్రెండింగ్ లో నిలుస్తోంది. కూరల్లో తక్కువ.. వార్తల్లో ఎక్కువుగా కనిపిస్తోంది. పంట అధికంగా పండే ఏపీ, కర్నాటక బోర్డర్ లో భారీ సెక్యూరిటీ అవసరమవుతోంది. పంటను కాపాడుకోవడానికి రైతులు కుటుంబాలతో గస్తీ కాస్తుండగా.. కోసిన పంటలను మార్కెట్ కు తరలించేందుకు, అక్కడ సంరక్షించేందుకు భారీ సెక్యూరిటీ అవసరమవుతోంది. చివరకు మార్కెట్లో విక్రయించే సమయంలో సైతం నిఘా కెమెరాలు ఫోకస్ చేయ్యాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

    ప్రస్తుతం కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. దీంతో పండించే రైతుల కొంగు బంగారంగా టమాటా మారుతోంది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులను చేస్తోంది. మహారాష్ట్ర రైతు ఇంట పంట పండింది. పుణే జిల్లా జున్నర్ తాలుకా పచ్ గడ్ గ్రామానికి చెందిన టమాటా రైతు ఈశ్వర్ గైకార్ నెలసరి ఆదాయం అక్షరాలా రూ.3 కోట్లు. ఎప్పుడు నష్టాలు చవిచూసే ఈశ్వర్ టమాటా కొరత పుణ్యమా అని కోట్ల రూపాయల ఆదాయాన్ని కళ్లచూశాడు.

    ఈశ్వర్ కు 16 ఎకరాల భూమి ఉంది. అందులోని 12 ఎకరాల్లో టమాటా సాగుచేస్తుంటాడు. 2021లో అయితే టమాటా సాగుచేసి..ధరలేక తీవ్రంగా నష్టపోయాడు. దాదాపు రూ.15 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. దీంతో మధ్యలో ఒక ఏడాది టమాటా సాగు నిలిపివేశాడు. ఈ ఏడాది మరోసారి సాగుకు ఉపక్రమించాడు. మేలో ధర లేకపోవడంతో పొలంలోనే పంటను పారబోశాడు. గత నెల రోజులుగా ధర స్థిరంగా కొనసాగుతుండడంతో ఆయన పంట పండింది. జూన్ 15 నుంచి జూలై 18 మధ్య ఆయన నికర ఆదాయం రూ.3 కోట్లు. ఓ రైతుకు ఇంతకంటే మరి ఏంకావాలి?