INDIA alliance : ‘ఇండియా’ కూటమికి కొత్తగా పెరిగిన సీట్లెక్కడ?

యూపీఏ నుంచి ఇండియాగా మారిన కాంగ్రెస్ ప్రతిపక్షాలకు కొత్తగా వచ్చిన సీట్లు ఏవో ఒక్కసారి చెప్పగలరా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్నది ఎవరూ చెప్పలేరు.

Written By: NARESH, Updated On : July 20, 2023 4:57 pm
Follow us on

INDIA alliance : దేశం పేరును ఓన్ చేసుకొని ప్రజలను మోసం చేయాలనుకోవడం అంత తేలిక కాదు.. ఈరోజు ప్రతిపక్షాలు అదే చేస్తున్నాయి. ఇండియా పేరు పెట్టుకొని ఈ ఇండియాను ఓడించడం ఎవరి తరం కాదు అని ఈ దేశాన్ని లింక్ చేసుకొని కాంగ్రెస్ చేస్తున్న యాగీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశాన్ని మోసం చేస్తున్నామనే భావన మీకు రావడం లేదా? అన్నది కాంగ్రెస్ ఆలోచించుకోవాలి.

యూపీఏ నుంచి ఇండియాగా మారిన కాంగ్రెస్ ప్రతిపక్షాలకు కొత్తగా వచ్చిన సీట్లు ఏవో ఒక్కసారి చెప్పగలరా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్నది ఎవరూ చెప్పలేరు.

ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ ప్రధానమైనవి. ఈ నాలుగు పార్టీలకు 3 రాష్ట్రాల్లో 63 ఎంపీలు ఉన్నారు.

-ఏ కూటమిలోనూ లేని పార్టీలు..
వైస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, బీఎస్సీ, మజ్లిస్, టీడీపీ, శిరోమణి ఆకాలీదళ్, ఏఐయూడీఎఫ్, జనతాదళ్‌ (ఎస్‌), ఆర్‌ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్‌(మాన్‌). వీటిలో వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్, టీడీపీలు పార్లమెంట్‌లో అధికార పక్షానికి తరచూ సానుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.

ప్రస్తుతం ఏ పార్టీలో లేని 11 పార్టీలు ఎన్నికల తర్వాత ఏదో ఒకవైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని బీజేపీ, కొన్ని కాంగ్రెస్‌ కూటమి వైపు వెళ్తాయన్న అభిప్రాయం ఉంది. ఇలా కాకుండా ఈ తటస్థ పార్టీలు జట్టు కట్టినా.. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ, ఇండియా పార్టీల్లో ఏదో ఒకదానికి మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘ఇండియా’ కూటమికి కొత్తగా పెరిగిన సీట్లు ఎన్ని దాని ప్రభావమెంత అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.