CPI Narayana : నోటి దూల నారాయణని పిచ్చాసుపత్రిలో చేర్పించండి

సీపీఐ నారాయణ మాత్రం సిద్ధాంతాల గురించి మాట్లాడరు.. మాట్లాడితే.. నోటి దూల.. వ్యక్తిత్వ హననం మీదనే మాట్లాడుతాడు. ఇది కమ్యూనిజం సిద్ధాంతం కాదు. అవతల వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసే వారిని కమ్యూనిస్టులు అనరు..

Written By: NARESH, Updated On : July 20, 2023 4:30 pm
Follow us on

CPI Narayana : తెలుగు నాట కమ్యూనిస్టులు అంటే ఎనలేని గౌరవం ఉండేది ఒకప్పుడు. ఎందరో మహానుభావులు పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చారు. పుచ్చల పల్లి సుందరయ్యా, తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బీమిరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల దంపతులు, ఇటీవలి కొండపల్లి సీతారామయ్య, ఇలా కమ్యూనిస్టు యోధులు తమ జీవితాన్నే పార్టీ కోసం త్యాగం చేసిన వారు ఉన్నారు. వారికి ఇప్పటికీ అందరూ గౌరవం ఇస్తున్నారు. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా వీళ్ల ఆదర్శాలు కొనసాగాయి.

అయితే అంత గొప్ప పార్టీలో ఉన్న సీపీఐ నారాయణకు ఒక్కటైనా వీళ్ల ఆదర్శాలు అబ్బాయా? వాళ్లు విధానాల పరంగా విమర్శించేవారు. కానీ నారాయణ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. కమ్యూనిస్టుల మొదటి క్వాలిటీ అదీ. ప్రతీ పార్టీ వాళ్లు కమ్యూనిస్టు నేతలను గౌరవించేవారు.

సీపీఐ నారాయణ మాత్రం సిద్ధాంతాల గురించి మాట్లాడరు.. మాట్లాడితే.. నోటి దూల.. వ్యక్తిత్వ హననం మీదనే మాట్లాడుతాడు. ఇది కమ్యూనిజం సిద్ధాంతం కాదు. అవతల వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసే వారిని కమ్యూనిస్టులు అనరు..

ఆ మధ్యన భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడాన్ని సీపీఐ నారాయణ తప్పుపట్టారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. పార్టీలు మార్చుతున్న చిరంజీవిని పిలవడమేమిటని ప్రశ్నించారు. ఆయన్ను బదలులు సూపర్ స్టార్ కృష్ణను పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చారు. అది ఎప్పుడు పేలుతుందో.. ఎప్పుడు పేలదో తెలియదని ఎద్దేవా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులు, జన సైనికులను బాధించాయి.

నోటి దూల నారాయణ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.