
Mohan Babu Family Crisis: గురువు దాసరి నారాయణరావు జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలే మోహన్ బాబును వెంటాడటం యాదృచ్ఛికం. మోహన్ బాబు-దాసరి నారాయణరావుల వారసుల విషయంలో కొన్ని పోలికలు ఉన్నాయి. దాసరి నారాయణరావు లెజెండరీ డైరెక్టర్. కానీ కొడుకులను నిలబెట్టలేకపోయారు. చిన్న కుమారుడు అరుణ్ ని హీరో చేద్దాం అనుకున్నారు. గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అరుణ్ సక్సెస్ కాలేకపోయాడు. హీరోగా ఎదగడం అంత ఈజీ కాదని ఆ ప్రయత్నాలు వదిలేశాడు. పెద్ద కుమారుడు ప్రభు వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి.
దాసరి 2017లో కన్నుమూశారు. ఆయన పోయాక అన్నదమ్ములకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదాలు చోటు చేసుకున్నాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటిలో పెద్ద కుమారుడు ప్రభు ఉంటాడు. ఆ ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ములు వీధికెక్కారు. అరుణ్ మా ఇంటి గేటు దూకి లోపలి వచ్చి దాడి చేశాడని అన్నయ్య ప్రభు కంప్లైంట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తెచ్చిన దర్శక దిగ్గజం వారసుల రచ్చ అభిమానులను బాధ పెట్టింది.
దాసరి బ్రతికి ఉంటే ఆయన కళ్ళ ముందు కొడుకులు ఇలా కొట్టుకుంటే ఆయన చూసి తట్టుకునేవారా? అనే సందేహాలు కలిగాయి. కాగా దాసరి శిష్యుడు మోహన్ బాబు కొడుకులు ఆయనకు బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. కుటుంబ పరువు బజారుకీడుస్తున్నారు. దాసరి కుమారులతో మంచు విష్ణు, మంచు మనోజ్ లకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ ఇద్దరి మాదిరి ఈ ఇద్దరు కెరీర్లో ఎదగలేకపోయారు. పదుల సంఖ్యలో చిత్రాలు చేసి కూడా మార్కెట్ సంపాదించలేదు.

మనోజ్, విష్ణులతో సినిమా తీసే నిర్మాత పరిశ్రమలో లేడు. వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకోవాల్సిందే. సంపాదన ఉన్నప్పుడు ఆస్తుల మీదకు ఫోకస్ పోదు. తండ్రి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనోజ్, విష్ణులకు రూపాయి సంపాదన లేదు. మోహన్ బాబు డబ్బులిస్తే సినిమాలు చేస్తారు. శ్రీవిద్యా నికేతన్ ఈ ఫ్యామిలీకి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. రాయలసీమలో పేరున్న ఈ విద్యాసంస్థలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మనోజ్ రెండో వివాహం చేసుకోవడంతో ఆస్తుల మీద ఆశలు పెరిగి గొడవలకు కారణమయ్యాయి.