
Srinivasa Reddy- Rajitha: తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు ఉంది. వారు కూడా తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు హస్య నటులు సినిమాల్లోనే కాకుండా రియల్ గా కూడా కలుసుకుంటారన్న విషయం చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా పుణ్యమాని ఆ విషయాలు ఇప్పడిప్పెడే తెలుస్తున్నాయి. లేటేస్టుగా సీనియర్ నటి రజిత కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె బర్త్ డే సందర్భంగా తోటి నటులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను నెట్టింట్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి రజిత బుగ్గలను పట్టుకొని ఉండడం ఆసక్తిగా మారింది.
సీనియర్ నటి రజిత చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదట్లో హస్య నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య సినిమాలు తక్కువైనా కొన్ని వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. అయితే హీరో, హీరోయిన్లకే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందని కొందరు నటులు నిరూపిస్తున్నారు. తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

రజిత పర్సనల్ విషయాలకొస్తే ఆమె తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1987లోనే రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ‘అగ్నిపుత్రుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఈ సినిమా చేస్తున్నప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అగ్నిపుత్రులు సినిమాలో నాగేశ్వర్ రావు కూతురుగా నటించారు. ఈ సినిమా పూర్తయిన తరువాత పదో తరగతి పూర్తి చేశారు. ఆ తరువాత చెన్నై వెళ్లిన రజిత ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సినిమాల్లో నటించారు. 1998లో ‘పెళ్లి కానుక’ సినిమా తో ఆమెకు ఉత్తమ హస్య నటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకుంది. ఆమె రీసెంట్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో కనిపించింది.
రజిత తన విషయాలను ఎప్పటికప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఈ వేడుకలో సురేఖావాణి, శ్రీనివాసరెడ్డి, రాజారవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే బేబి బుగ్గలు పట్టుకొని ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ విషెష్ చెప్పారు. మిగతా వారు కూడా ఆయనకు కోరస్ పాడారు. ఈ వీడియో నెట్టింట్లో హల్ చేయడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.