Homeఆంధ్రప్రదేశ్‌Jagan- Chandrababu: ట్రోల్ ఆఫ్ ది డే: నాన్చాలి, తడిగుడ్డతో గొంతు కోయాలి.. జగన్ కు...

Jagan- Chandrababu: ట్రోల్ ఆఫ్ ది డే: నాన్చాలి, తడిగుడ్డతో గొంతు కోయాలి.. జగన్ కు చంద్రబాబుకు తేడా అదే..

Jagan- Chandrababu
Jagan- Chandrababu

Jagan- Chandrababu: కోతికి కొబ్బరి చిప్ప దొరికొతే ఎలా ఉంటుంది? పోనీ తిప్పడు తీర్థం పోతే ఎలా ఉంటుంది? ఈ సామెతలకు అసలైన అర్థం కావాలంటే రోజు పచ్చ మీడియా ఛానల్స్ చూడాలి.. ఎందుకంటే మొన్న 3 ఎమ్మెల్సీ, నిన్న ఒక్క ఎమ్మెల్సీ గెలవగానే.. పచ్చ మీడియాకు ప్రాణం లేచి వచ్చింది. బాబు గెలుస్తాడనే నమ్మకం వచ్చింది. లోకేష్ బాబు బావి ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణం అనే ఆశావాహ దృక్పథం కలిగింది..మరీ ఇన్నాళ్ళు ఇది ఏమైంది? వరుస ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, గెలిచిన పార్టీని హేళన చేసినప్పుడు ఈ సంతలోకి వెళ్ళింది ఈ జర్నలిజం?

ప్రజాదరణ లేనివారిని, ప్రజల్లో నమ్మకం కలిగించలేని వారిని జగన్ దూరం పెడుతున్నాడు. గతంలోను ఇదే విషయాన్ని చెప్పాడు. మొన్న కూడా ఒక మీటింగ్లో ఇదే విషయాన్ని వెల్లడించాడు.. ఇందులో దాచుకోవడానికి లేదు. తడుముకోవడానికీ లేదు.. కానీ ఇదే విషయాన్ని పచ్చ మీడియా మరో విధంగా చెబుతోంది. ప్రజాదరణ లేని వారికి టికెట్ ఇవ్వబోనని ముఖం మీద చెప్పకూడదట! అలా చెబితే జాతి ద్రోహమట! ముఖం మీద చెప్పకుండా నాన్చాలట!

కానీ ఇదే చంద్రబాబు 2018 లో ఎం తమందికి టికెట్లు ఇచ్చాడు? పార్టీని నమ్ముకుని, పార్టీ కోసమే పని చేసిన వారిని ఏం చేశాడో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అందుకే కదా వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు బయటకు పోయింది.. అవకాశం దొరికినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. కానీ ఈ విషయాన్ని పచ్చ మీడియా చెప్పదు.. ఏంటో గురువింద నీతులు ప్రపంచానికే తప్ప మాకు కాదు అనే స్థాయిలో పచ్చ మీడియా వ్యవహరిస్తుంది.

Jagan- Chandrababu
Jagan- Chandrababu

ప్రజల్లో నమ్మకం లేని వారికి టికెట్లు ఇచ్చి పార్టీని ఓడించే కంటే.. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తేనే కదా అధికారంలోకి వచ్చేది.. ప్రజల్లో నమ్మకం లేని వారికి టికెట్లు ఇచ్చి, పార్టీ ఓడిపోతే.. అప్పుడు ఈ పచ్చ మీడియా మళ్ళీ రంకెలు వేస్తుంది. చూశారా మా బాబు చక్రం తిప్పితే వైసిపి కూసాలు కదిలాయి అంటూ జబ్బలు చ
రుస్తుంది.. ఫర్ డిబేట్ సేక్.. చంద్రబాబు ఇప్పుడున్న వాళ్లలో ఎంతమందికి టికెట్లు ఇవ్వగలడు? ఎంతమందిని గెలిపించగలడు? 175 స్థానాల్లో అందర్నీ పోటీకి దింపగలడా? ఈ సమాధానాలకు పచ్చ మీడియా సమాధానం చెప్పి.. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే బాగుంటుంది.. అన్నట్టు జగన్ సుద్దపూస అనుకోవడానికి కూడా లేదు.. కాకపోతే రాజకీయమంటేనే అధికారం కాబట్టి.. అతడు అంతకుమించి ఏమీ చేయలేడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular