https://oktelugu.com/

Tamil Nadu Lovers: లవ్ టుడే సినిమాలోలాగా ఫోన్లు మార్చుకున్నారు.. చివరకు ఏమైందంటే?

తమిళనాడు రాష్ట్రంలో ‘లవ్ టుడే’ స్టోరీ రియల్ గా జరిగింది. ఆ కథలో లవర్స్ విడిపోతారు.. మళ్లీ కలుస్తారు. కానీ ఇక్కడి ప్రేమికుడు మాత్రం జైలుకు పోయాడు. అలాగే ఇద్దరు యువతులు ఆపద నుంచి తప్పించుకున్నారు. ఈ రాష్ట్రంలోని బేలూరుకు చెందిన అరవింద్ అనే కుర్రాడు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి స్థానికంగా ఓ యువతితో కొన్ని నెలల కిందట నిశ్చితార్థం అయింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నారు గదా.. ఇద్దరు ఫోన్లో తరుచూ మాట్లాడుకునేవారు.

Written By: , Updated On : July 17, 2023 / 12:07 PM IST
Tamil Nadu Lovers

Tamil Nadu Lovers

Follow us on

Tamil Nadu Lovers: సినిమాల్లో జరిగే కొన్ని సీన్లు బయట కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది సినిమాల ప్రభావంతో రియల్ లైఫ్ లోనూ అనుకరిస్తారు. కానీ ఒక్కోసారి అవి బెడిసికొడుతూ ఉంటాయి. కొన్ని నెలల కిందట వచ్చిన ‘లవ్ టుడే’ సినిమా తమిళం, తెలుగులో సక్సెస్ అయింది. లవ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కొత్త కోణంలో వచ్చింది. ఇద్దరు ప్రేమికులు తమ మొబైల్స్ ను మార్చుకొని ఒకరినొకరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ తరువాత మళ్లీ కాంప్రమైజ్ కలుస్తారు. ఇది ఆ సినిమా స్టోరీ. అయితే ఇప్పుడు రియల్ గా ఇలాగే చేయాలనుకున్నారు ఇద్దరు ప్రేమికులు. కానీ ఇక్కడి కథ మారింది.. ఏం జరిగిందో చూడండి..

తమిళనాడు రాష్ట్రంలో ‘లవ్ టుడే’ స్టోరీ రియల్ గా జరిగింది. ఆ కథలో లవర్స్ విడిపోతారు.. మళ్లీ కలుస్తారు. కానీ ఇక్కడి ప్రేమికుడు మాత్రం జైలుకు పోయాడు. అలాగే ఇద్దరు యువతులు ఆపద నుంచి తప్పించుకున్నారు. ఈ రాష్ట్రంలోని బేలూరుకు చెందిన అరవింద్ అనే కుర్రాడు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి స్థానికంగా ఓ యువతితో కొన్ని నెలల కిందట నిశ్చితార్థం అయింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నారు గదా.. ఇద్దరు ఫోన్లో తరుచూ మాట్లాడుకునేవారు.

అయితే వీరు ‘లవ్ టుడే’ సినిమాలోలాగా ఫోన్లు మార్చుకొని ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఫోన్లు మార్చుకున్నారు. అయితే అరవింద్ ఫోన్లో చాలా రోజుల నుంచి మెసేజ్ లు, వీడియోలు అలాగే ఉన్నాయి. యువతి తన మొబైల్ ను పరిశీలించగా అందులో ఓ యువతికి సంబంధించిన దుస్తులు లేకుండా ఉన్న వీడియో బయటపడింది. ఈ వీడియోను చూసిన పెళ్లిచేసుకోబోయే యువత షాక్ తింది.

దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. అంతటితో ఆగకుంకు దుస్తులు లేకుండా ఉన్న వీడియో గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు అరవింద్ ను అరెస్టు చేశారు. ఆ యువకుడి మొబైల్ లో ఇంకేమైనా వీడియోలు ఉన్నాయా? అని చెక్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా యువకుడి బండారం పెళ్లి కాకముందే ఇలా బయటపడడంతో ‘లవ్ టుడే’ యువతిని సేవ్ చేసిందని అనుకుంటున్నారు.