Homeక్రీడలుక్రికెట్‌Mohammed Kaif Slams Amir: ఒరేయ్ నువ్వా టీమిండియా గురించి మాట్లాడేది.. పాక్ క్రికెటర్ అమీర్...

Mohammed Kaif Slams Amir: ఒరేయ్ నువ్వా టీమిండియా గురించి మాట్లాడేది.. పాక్ క్రికెటర్ అమీర్ కు ఇచ్చి పడేసిన మహమ్మద్ కైఫ్

Mohammed Kaif Slams Amir: కొద్దిరోజులుగా టీమిండియా మీద పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ లేకి వ్యాఖ్యలు చేస్తున్నాడు. టీమిండియా సూపర్ 8 లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోతుందని.. టీమిండియా ఆటగాళ్లు అంతగా ఫామ్ లో లేరని.. సెమి ఫైనల్లో టీమ్ ఇండియా గెలవదని.. ఆటగాళ్లు సత్తా చూపించలేరని.. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు.

Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!

ఇచ్చి పడేసిన కైఫ్

మహమ్మద్ అమీర్ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తెరపైకి వచ్చాడు. మహమ్మద్ అమీర్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ” అమెరికా వంటి పార్ట్ టైం ప్లేయర్లను చూసి మహమ్మద్ అమీర్ భయపడిపోయేవాడు. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ ఓవర్లో 18 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణమయ్యాడు. ఒక్క ఫోర్ మినహా మిగతావన్నీ వైడ్లు వేశాడు. దారుణంగా ఫీల్డింగ్ చేశాడు. అందువల్లే పాకిస్తాన్ ఓడిపోయింది. యార్కర్లు కూడా సరిగా వేయలేని మహమ్మద్ అమీర్ ను సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని” మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.

సోషల్ మీడియాలో సెటైర్లు

మహమ్మద్ అమీర్ టీమిండియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మహమ్మద్ అమీర్ జోకర్ లాంటివాడని.. అతడు టీం ఇండియా మీద ఎంత విషం చిమ్మినా సరే.. అది జట్టుకు లాభంగా మారుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. ” అతడు ఒక జోకర్ లాంటివాడు. టీమిండియా మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే టీం ఇండియా ఎలాగైనా ఆడుతుంది. కఠినమైన పరిస్థితుల్లో స్థిరమైన చిత్తాన్ని ప్రదర్శిస్తుంది. సూపర్ 8 మ్యాచ్ లో ఇదే ప్రతిబింబించిందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని మహమ్మద్ అమీర్ వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలకు టీమ్ ఇండియా అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ అతడు తన తీరు మార్చుకోవడం లేదు. పైగా మరింత లేకిగా మాట్లాడుతున్నాడు. టీమిండియా సెమి ఫైనల్లో గెలిచిన తర్వాత అతడికి తగ్గట్టుగా కౌంటర్ ఇస్తామని టీం ఇండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ 8 మ్యాచ్ లో గెలిచిన తర్వాత టీమిండియా అభిమానులు అమీర్ ను గట్టిగానే వేసుకున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version