Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika Wedding Reception: గ్రాండ్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్...

Vijay Deverakonda Rashmika Wedding Reception: గ్రాండ్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్..సెలెబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే!

Vijay Deverakonda Rashmika Wedding Reception: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika mandanna) జంట పెళ్లి ఉదయ్ పూర్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో మన కళ్లారా చూశాము . సోషల్ మీడియా లో ఇప్పటికీ ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ జంటని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ లాగా ఉన్నారంటూ ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు . పాన్ ఇండియా లెవెల్ లో వీళ్లిద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉండడం తో , ఇద్దరి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో అప్లోడ్ చేసిన ఫోటలకు మిలియన్ల సంఖ్యలో లైక్స్ ,కామెంట్స్ , షేర్స్ వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు ఇండియా లో ఏ సెలబ్రిటీ కి కూడా జరగలేదు. పెళ్లి తర్వాత హైదరాబాద్ కి వచ్చిన ఈ దంపతులు, ఇండియా వైడ్ గా పలు ముఖ్యమైన ఆలయాల్లో అన్నదానాలు , స్వీట్ల పంపిణీ చేశారు.

 

Vijay Deverakonda Rashmika Wedding Reception
Vijay Deverakonda Rashmika Wedding Reception

 

Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!

ఇక నిన్ననే హైదరాబాద్ లోని ఒక హోటల్ లో అభిమానులకు స్పెషల్ గా లంచ్ ఏర్పాటు చేశారు. స్వయంగా వీళ్లిద్దరు తమ చేతుల మీదుగా అభిమానులకు అన్నం వడ్డించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా రష్మిక ప్రేమతో విజయ్ దేవరకొండ కి నోట్లో అన్నం తినిపించిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే నేడు వీళ్లిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్, తాజ్ బంజారా లో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరు అయ్యారు. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జంటకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ జంట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వంటి వారిని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

 

Vijay Deverakonda Rashmika Wedding Reception
Vijay Deverakonda Rashmika Wedding Reception

ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా PMO ఆఫీస్ నుండి ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. ఇకపోతే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి వచ్చిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరో ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగ చైతన్య, అఖిల్ , రవితేజ, నేచురల్ స్టార్ నాని , మోహన్ బాబు , మంచు విష్ణు, మంచు మనోజ్ తదితరులు హాజరు అయ్యారు. కాసేపట్లో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు కూడా రాబోతున్నాయ్. ప్రస్తుతం ఈ రిసెప్షన్ కి సంబంధించిన లైవ్ నడుస్తోంది, ఆ వీడియో ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

 

Virosh Reception LIVE 🔥| Vijay Deverakonda | Rashmika Mandanna - TV9

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version