Homeట్రెండింగ్ న్యూస్Husband And Wife: కట్టుకున్నోడిపై కేసులు.. రంకు మొగుడితో రాసలీలు.. హోటల్‌లో పట్టుబడ్డ భార్య!

Husband And Wife: కట్టుకున్నోడిపై కేసులు.. రంకు మొగుడితో రాసలీలు.. హోటల్‌లో పట్టుబడ్డ భార్య!

Husband And Wife: మన దేశంలో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్త్రీ, పురుషులు తమ ప్రవర్తనతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి మోజులు కట్టుకున్నవారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది చట్టాల్లోని లొసుగలను ఆసరాగా చేసుకుని అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ మహిళ.. గృహ హింస చట్టాలను అడ్డుగా పెట్టుకుని భర్తపై కేసులు పెడుతూ.. రంకు మొగుడితో రాసలీలు నెరిపింది. చివరకు హోటల్‌లో అడ్డంగా దొరికిపోయింది.

తప్పుడు కేసులు పెడితే విడాకులే..
భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒకరి మీద మరొకరు తప్పుడు కేసులు పెట్టుకుంటే, అవి తప్పుడు కేసులు అని నిర్ధారించబడితే, బాధితులకు తమ జీవిత భాగస్వాముల నుంచి∙విడాకులు కోరే హక్కు కల్పించేలా చట్ట సవరణలు చేయాలని లా కమిషన్‌ 18 ఏళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎంతోమంది మహిళలు అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందుకే చట్టాలు వారికి అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని ఆసరాగా చేసుకుని తాజాగా ఓ మహిళ కూడా అలాంటి పనే చేసింది. ఒక్క కేసు కాదు.. ఒక మహిళ ఎన్ని రకాల కేసులు పెట్టగలదో.. అన్ని అవకాశాలు ఉన్న కేసులను భర్తపై పెట్టింది.

భర్తను ఇరికించి.. బరితెగించి..
అలా భర్తను వివిధ కేసులలో ఇరికించి కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. భర్త పై కేసులు పెట్టి హింసించిన సదరు మహిళ చేసిన ఓ పనికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఓయో హోటల్‌ రూమ్‌లో పరాయి వ్యక్తితో పట్టుబడింది ఆ మహిళ. పరాయి వ్యక్తితో ఒంటరిగా ఉండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆమె బండారం బయటపడింది. దీంతో అప్పటివరకు భర్త విషయంలో ఆమె చెప్పిన మాటలు నమ్మిన స్థానికులు.. ఆమె చేసిన పనితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిజంగా వేధింపులకు గురయ్యే మహిళలకు ఈ చట్టాలు మంచిదే కానీ.. ఆ చట్టాల్లోని లొసుగులను వాడుకొని వేధిస్తున్న ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. చాలా మంది మహిళలు అత్తవారింట్లో సర్దుబాటు కాలేక, నచ్చని భర్తతో కలిసి బతక లేక, ప్రియుడి మోజులో పడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. గతంలో ఓ ఐఏఎస్‌ కూడా ఇలాంటి తప్పుడు కేసుతో ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా రక్షణ చట్టాలు దుర్వినియోగం కాకుండా చూడాలని, తప్పుడు కేసులు పెడితే విడాకులు తీసుకునే అవకాశం ఇవ్వాలని మహిళా బాధితులు కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular