Husband And Wife Conflicts: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఇద్దరూ తెలియని వ్యక్తులు ఒకే దారిలో ప్రయాణం చేసే ఈ బంధంతో సృష్టి ఏర్పడుతుంది. ఒక వంశం అభివృద్ధి ఈ బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే సాంప్రదాయంగా వివాహం జరిపి దంపతులను కలకాలం జీవించేలా పెద్దలు దీవిస్తారు. అయితే వివాహ బంధం ఏర్పడిన తర్వాత దంపతులు కొన్ని జీవిత నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నియమాలతో వారి కుటుంబం సాఫీగా ఉండడంతో పాటు భవిష్యత్తులో అనుకున్న పనులు పూర్తవుతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవితం కూడా ఉంటుంది. వీటిలో వీరు నిద్రించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటంటే?
ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని అంటున్నారు. భర్త చేసే పనులన్నీ భార్యా చేస్తుంది. అయితే పనుల విషయంలో ఇద్దరు సమానంగా ఉండవచ్చు. కానీ సాంప్రదాయ ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రం భర్త కంటే భార్య ఒక అడుగు కిందికే ఉండాలి. అలా ఉండడంవల్ల వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి నిద్రించే సమయంలో ఈ నియమం పాటించడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉంటారు.
సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు సమానంగా నిద్రిస్తూ ఉంటారు. అంటే ఒకరి పక్కకు ఒకరు దిండును ఏర్పాటు చేసుకొని నిద్రిస్తారు. అంతేకాకుండా సరైన దిశ లేకుండా నిద్రించడం వల్ల కూడా వారిలో కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ నిద్రించే సమయంలో భక్తకంటే భార్య ఒక అడుగు కిందికి ఉండి నిద్రించాలి. అంటే భర్త తలకింద ఉండే దిండు కంటే భార్య తలకింద ఉండే దిండు కొంచెం కిందికి ఉండాలి. అలాగే భర్తకు ఎడమవైపున భార్య నిద్రిస్తూ ఉండాలి. భర్తకు గుండె లాగా భార్యను భావిస్తారు అందువల్ల భార్య ఎప్పుడు భర్తకు ఎడమవైపుకు ఉండడంవల్ల శ్రేష్టం అని పండితులు చెబుతున్నారు.
సాక్షాత్తు జగన్మాత రుక్మిణి దేవి, సీతాదేవికి మరికొందరు పతివ్రతలకు ఈ విషయాన్ని చెప్పింది. భర్తతో ఉన్న సమయంలో భార్య ఎడమవైపు ఒక అడుగు కిందికి ఉండడం వల్ల భర్త గౌరవం కాపాడినట్లు అవుతుంది. అంతేకాకుండా వీరు ఇలా ఉండడంవల్ల అన్యోన్యమైన జీవితాన్ని పొందుతారు. వంశాభివృద్ధికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జీవితాంతం సుఖంగా ఉండడానికి ఇలా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే అని అంటున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీటిని పాటించడం వల్ల వారి కుటుంబం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఇలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వల్ల వారు మాత్రమే కాకుండా వారి తరువాత తరాలు సంతోషంగా ఉండడంతో పాటు అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసే పుణ్యాలే పిల్లలకు ప్రతిఫలాలు ఉంటాయని చెబుతున్నారు