Husband And Wife Relationship: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది.. అలాగే సంతోషకరమైనది… ఎందుకంటే ఎన్నో విషయాలు తల్లిదండ్రులతో.. స్నేహితులతో పంచుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఒక భార్య తన భర్తతో.. ఒక భర్త తన భార్యతో తన సర్వస్వం మొత్తం చెప్పేస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అయితే భార్యాభర్తల జీవిత ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు కూడా లేకపోలేదు. వీటిని తట్టుకొని ముందుకు వెళ్లడమే అసలైన దాంపత్యం. అయితే ఒక వివాహితకు తన భర్త ఎప్పుడూ బాగా నచ్చుతాడు? ఎలా ఉంటే తాను నిజమైన మగాడు అని అంటుంది?
కొందరు పెళ్ళికాకముందు యువకులు యువతులను ఆకట్టుకోవడానికి అనేక రకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. అంటే అమ్మాయిలను ఆకట్టుకోవడానికి మంచి డ్రెస్ వేయడమో.. లేదా ఆకర్షణీయమైన బైక్ పై తిరగడమో.. డబ్బు ఉన్నట్లు చూపించడం వంటివి చేస్తుంటారు. ఇలా ఉండడంవల్ల కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అయి ప్రేమలో పడిపోతూ ఉంటారు. కానీ ఆ తర్వాత వారి గురించి తెలిసి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డబ్బు, బైక్ వంటివి అవసరం లేదు. తనతో జీవితం ఎలా ఉంటుందో చూపించాలి? అందుకు తన ప్రవర్తన మంచిగా ఉండే విధంగా చేసుకోవాలి.
ఎప్పుడూ అయినా ఒక అమ్మాయి తన తండ్రి వద్ద ఉంటే సేఫ్ అని అనుకుంటుంది. ఎందుకంటే ఒక తండ్రి తన కూతురు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అయితే తన తండ్రి లాగా తన భర్త కూడా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. తన తండ్రి వాలే ప్రేమ, వాత్సల్యం చూపిస్తూ నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటుంది. కానీ నేటి యువకులు పైకి ఒకలాగా.. లోపల మరోలా కనిపిస్తున్నారు. పెళ్లి అయ్యేవరకు బాగున్నట్లు నటించి.. పెళ్లి అయిన తర్వాత నిజరూపం బయటపెడుతున్నారు.
ఇలాంటి సమయంలో అమ్మాయిలు మగవాళ్ళను నమ్మే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే సమాజంలో మంచివారు ఎంతోమంది ఉన్నారు. నిజమైన మగవాడు ఎప్పుడూ తనకోసం కాకుండా తన కుటుంబం కోసం.. తన భార్య కోసం.. తన పిల్లల కోసం తపన పడుతూ ఉంటాడు. వారికి ఎప్పుడూ ఏం కావాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి తన తల్లి కోసం.. కుటుంబ కోసం కష్టపడుతున్నాడు అంటే.. పెళ్లయిన తర్వాత తన భార్య కోసం కూడా కష్టపడే తత్వం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారినే చాలామంది అమ్మాయిలు నిజమైన మగాడు గా కీర్తిస్తారు.