Homeఎంటర్టైన్మెంట్Prabhas: రొమాన్స్ జరగలేదు, అదే జరిగితే పెళ్ళైపోయేది... ఫైనల్ గా ఓపెన్ అయిన ప్రభాస్!

Prabhas: రొమాన్స్ జరగలేదు, అదే జరిగితే పెళ్ళైపోయేది… ఫైనల్ గా ఓపెన్ అయిన ప్రభాస్!

Prabhas: అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్యాన్స్ తో పాటు సగటు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు ఆహా నిర్వాహకులు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యారు. ప్రభాస్-బాలయ్య ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబర్స్ పోటెత్తారు. ఆహా యాప్ లో లక్షల్లో లాగిన్ కావడంతో దెబ్బకు జామ్ అయ్యింది. ఆహా యాప్ మొత్తంగా షట్ డౌన్ అయ్యింది. ఆహా యాజమాన్యం దీనిపై అధికారిక ప్రకటన చేసింది. ఆహా ప్రసారాలు నిలిచిపోయాయి. టీమ్ పునరుద్ధరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎప్పుడో అర్ధరాత్రికి ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యింది.

Prabhas
Prabhas, NBK

అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి మేటర్ బయటకు లాగుతారని అందరూ నమ్మారు. ఆడియన్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాలకృష్ణ చాలా వరకు ఆ కోణంలో ప్రభాస్ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. సిల్వర్ స్క్రీన్ పై చాలా మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశావు… అయితే ఆఫ్ స్క్రీన్ లో ఎవరితో రొమాన్స్ చేశావు? అని బాలయ్య అడిగారు. సినిమాల్లో కాకుండా బయట రొమాన్స్ ఎవరితో చేశావో చెప్పాలని, బాలకృష్ణ ఇరుకున పెట్టారు.

ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో తెలియక ప్రభాస్ ఇబ్బంది పడ్డారు. మీ వాళ్ళు నాకు ఏదో టాబ్లెట్ ఇచ్చారు సర్, మర్చిపోయాను అని ప్రభాస్ సమాధానం చెప్పాడు. అలా తప్పించుకోవద్దు సమాధానం చెప్పాల్సిందే అని బాలయ్య పట్టుబట్టాడు. ఎవరితో రొమాన్స్ జరగలేదు సర్, జరిగితే పెళ్ళైపోయేదని ప్రభాస్ మరొక సమాధానంగా చెప్పారు. పెళ్లి కాలేదు కాబట్టే రొమాన్స్ చేసి ఉంటావని, బాలయ్య ప్రభాస్ తో అన్నారు.

Prabhas
Prabhas, NBK

అది కొంచెం బోల్డ్ క్వశ్చన్ కావడంతో బాలయ్య వదిలేశాడు. సమాధానం చెప్పకపోయినా మరో ప్రశ్నకు వెళ్లారు. కాగా రామ్ చరణ్ కి కాల్ చేసిన బాలకృష్ణ… ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ షేర్ చేయాలని అడిగారు. త్వరలో ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చరణ్ అన్నారు. ఈ హింట్ చాలు నేను అల్లుకుపోతా అన్న బాలకృష్ణ… అమ్మాయి ఎవరు రాజునా, రెడ్డినా, చౌదరినా? నాయుడునా? సనన్ నా? లేక శెట్టినా?… హింట్ ఇవ్వాలని చరణ్ ని అడిగారు. అదేమీ చెప్పలేను కానీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాడు, అని చరణ్ వెల్లడించారు. చరణ్ నువ్వు నన్ను ఇరికించేశావని ప్రభాస్ ఆందోళన చెందాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper