Bomb Cyclone 2022: క్రిస్మస్ అనేది అమెరికాలో చాలా పెద్ద పండుగ.. ఈసారి 60 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. మిగతా 40 శాతం లో అతి తక్కువ మంది మాత్రమే పండగ చేసుకున్నారు.. విద్యుత్ దీపాలతో ధగ ధగా మెరవాలిసిన ఇండ్లు కాంతివిహీనంగా కనిపించాయి. అంతేకాదు బాంబ్ అనే మంచు తుఫాను తాకిడికి అమెరికా మొత్తం గడ్డకట్టుకుపోయింది. అంతేకాదు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. రోడ్లపై పది అడుగుల మేర మంచు దట్టంగా పరుచుకుంది.. మంచును తొలగిస్తుంటే శవాలు బయటికి వస్తున్నాయి.. ఇప్పటివరకు మృతుల సంఖ్య వందలు దాటింది.

ఎందుకు కురుస్తోంది
మంచు కురవడం అనేది శీతాకాలంలో అమెరికాలో సర్వసాధారణం.. కానీ ఈసారి కనీ విని ఎరుగని స్థాయిలో మంచు కురిసింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పండుగ సంబరం లేకుండా చేసింది.. అమెరికాలో ఈసారి కురిసిన హిమపాతం 70 సంవత్సరాల క్రితం నమోదయింది.. వాతావరణ శాఖ అధికారుల పరిశీలనలో ఇది వెల్లడైంది.. వాతావరణం ప్రతి ఏటా మార్పులకు గురవుతుంది. దీనివల్ల రుతువుల గమనంలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అవి అనేక విపత్తులకు దారి తీస్తాయి.. ప్రస్తుతం అమెరికాలో కురుస్తున్న మంచు తుఫాను కూడా ఆ కోవలోకే చెందుతుంది.
ఇతర దేశాల్లో కూడా
అమెరికా మాత్రమే కాకుండా ఆసియా ఖండంలో జపాన్, ఇండియాలోని రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. గతంలో ఎన్నడు లేని విధంగా మంచు కురుస్తుండడంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అమెరికాలో బాంబ్ మంచు తుఫాన్ కొంత తెరిపినిచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం కాదు. అక్కడక్కడ సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ… ప్రజలు ఇంకా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. అటు విద్యుత్ లేక… ఇటు బయటకు వచ్చే మార్గం లేక ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

13 రాష్ట్రాలపై
బాంబ్ తుఫాను అమెరికాలోని 13 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాల్లో -45.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోస్టన్, లింకన్, న్యూయార్క్, చికాగో, మిషి గాన్ వంటి ప్రాంతాల్లో మైనస్ పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుమారు పది లక్షల ఇళ్ళు మంచు తుఫాన్ బారిన పడ్డాయి. 60% జనాభా మంచు వల్ల తీవ్రంగా ప్రభావితం అయింది. ఇప్పటికీ పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తూనే ఉంది.. సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో మాత్రం కాదు. అక్కడక్కడ కార్లలో నుంచి శవాలు బయటకు వస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.