Aha Crashes: ఈ కథనం రాసే సమయానికి ఇంకా ఆహా యాప్ ఓపెన్ కాలేదు.. ట్విట్టర్లో చెక్ చేస్తుంటే… ప్రభాస్ అభిమానుల తాకిడికి తట్టుకోలేక తమ సర్వర్లు క్యాష్ అయ్యాయని ఆహా టీం ఒక ట్వీట్ చేసింది..ఇది ఫేస్ బుక్ లోనూ కనిపించింది.. వాస్తవానికి ప్రభాస్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నప్పటికీ.. అతనిపై అభిమానుల అంచనాలు స్కై ఇస్ ద లిమిట్ లా ఉన్నాయి. వివాద రహితుడు, అందరికీ డార్లింగ్ లాంటి వాడు అవ్వడం వల్ల కావచ్చు. పైగా నందమూరి బాలకృష్ణ “అన్ స్టాపబుల్ షో” కూడా జనాలకు బాగా రీచ్ అవడం వల్ల కావచ్చు.. బాలకృష్ణ, ప్రభాస్ టాక్ షో అనగానే.. జనాలకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. వాస్తవానికి ఈ టాక్ షో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. లెంగ్త్ మరీ ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. వాస్తవానికి అన్ స్టాపబుల్ టాక్ షో శుక్రవారం స్ట్రీమింగ్ కావాలి.. కానీ ఆహా టీం గురువారం నుంచే మొదలుపెట్టింది.. పైగా దీనిని మొదట్లో డిసెంబర్ 31 నుంచి స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో ఆహా టీం తన నిర్ణయాన్ని మార్చుకుంది.. గురువారం నుంచి స్ట్రీమ్ చేయడం ప్రారంభించింది.

ఏం సర్వర్లు ఇవి
ఎప్పుడైతే ఆ అమెజాన్, నెట్ ప్లిక్స్, సోనీ లీవ్, వూట్,జీ5 వంటి ఓటీటీలు తెలుగును పట్టించుకోవడం మానేశాయో అప్పుడే ఆహాకు సబ్ స్క్రైబర్లు పెరిగారు.. అంతేకాదు ఆహా కూడా మంచి మంచి రియాల్టీ షోలు ప్లాన్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది.. అనిల్ రావిపూడి లాంటి దర్శకుడితో కామెడీ షో చేయించడం వెనక ఉద్దేశం కూడా అదే.. ఇలాంటివే తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాణ్యమైన సర్వర్లు వాడాల్సిన ఆహా టీం… సాధారణమైన సర్వర్లు వాడుతోంది. ఫలితంగా వాటి మీద ఒత్తిడి పెరగడంతో క్రాష్ అవుతున్నాయి.. సన్ నెక్ట్స్ కూడా ఇలాంటి సర్వర్ లనే వాడుతున్నట్టు సమాచారం.
ఒత్తిడి తట్టుకోలేవు
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలు నాణ్యమైన సర్వర్లను వాడుతున్నాయి. దీనివల్ల ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ అవి తట్టుకుంటున్నాయి. ఆహా టీం నాణ్యమైన సర్వర్లు ఏర్పాటు చేయలేక ఆ నెపాన్ని ప్రభాస్ మీదకు నెట్టేస్తోంది కానీ… ఓటీటీ అన్నప్పుడు విపరీతమైన స్టోరేజ్ కెపాసిటీ ఉన్న సర్వర్లు కావాలి. కానీ అలాంటివి కాకుండా స్థానికంగా తయారైన సర్వర్ ను ఉపయోగించడం ఆహా నిర్వహణ ఎలా ఉందో చెబుతోంది.

అంతేకాదు సర్వర్లు క్రాష్ అయిన విషయాన్ని ఆ టీమ్ సంజాయిషీ ఇచ్చుకున్న విధానం కూడా అలానే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల సర్వర్ క్రాష్ అయిందని ఆహా టీం పాజిటివ్ గా చెప్పుకోవచ్చు.. కానీ దాని నిర్వహణలో ఎంత డొల్లతనం ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు.. అంతేకాదు ఓటీటీ ల మీద ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్ ఇతర వెబ్సైట్లో ప్రసారం చేయకూడదని… ఇది ఆహాకు లాభం చేకూర్చే తీర్పే. కొంపతీసి ఆ సైట్ల వారే కడుపు మండి ఆహా సర్వర్లను క్రాష్ చేశారేమోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని… ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ అయిన ప్రభాస్ ఎపిసోడ్.. అభిమానులు చూడకముందే క్రాష్ అయిపోవడం మింగుడు పడని విషయం. దీనిపై ఇప్పటికే నెటిజన్లు అల్లు అరవింద్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.