Waltair vVeerayya Pre Release Event: అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవుతుంది..మొదటి నుండి ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..ఆ అంచనాలను మొన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ పదింతలు ఎక్కువ చేసింది..మెగాస్టార్ వింటేజ్ మాస్ అంటే ఏమిటో మరోసారి అభిమానులకు ప్రేక్షకులకు రుచి చూపించాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మరియు రవితేజ ఇచ్చిన ప్రసంగాలతో పాటు, డైరెక్టర్ బాబీ ఇచ్చిన స్పీచ్ కూడా హైలైట్ గా నిలిచింది..ముఖ్యంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి.

అయితే సభా ప్రాంగణం మొత్తం ‘బాబులకు బాబు కళ్యాణ్ బాబు’ అనే స్లొగన్స్ తో హోరెత్తిపోయింది..డైరెక్టర్ బాబీ కూడా వాళ్లలో మరింత ఉత్సాహం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తాడు..ముఖ్యంగా రాజకీయాలను టచ్ చేస్తూ ‘చిరంజీవి గారు మీకు రాజకీయాలు పనికి రావు..అందుకు మీ తమ్ముడు’ ఉన్నాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మొత్తం దద్దరిల్లింది..అంతే కాకుండా ‘ఈవెంట్ డల్ గా అనిపించనప్పుడల్లా అందరూ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవండి’ అంటూ బాబీ చేసిన కామెంట్స్ కి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.