Chiranjeevi Satires On Koratala: మరోసారి కొరటాల శివ పై సెటైర్లు వేసిన మెగాస్టార్ చిరంజీవి..కొరటాల చిరుని ఇంతలా అవమానించాడా?

Chiranjeevi Satires On Koratala: మెగాస్టార్ చిరంజీవి తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో చూడని హిట్ అంటూ లేదు..చూడని ఫ్లాప్ అంటూ లేదు..ఎంతో మంది డైరెక్టర్స్ తో ఆయన కలిసి పనిచేసాడు..తనకి డిజాస్టర్ ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తోను మరోసారి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి..ఫ్లాప్ అయ్యింది కదా అని డైరెక్టర్ మీద కోపం పెంచుకునే మనస్తత్వం కాదు చిరంజీవిది..అందుకే అందరూ ఆయనని అంతలా అభిమానిస్తారు..కానీ చిరంజీవి ఒక డైరెక్టర్ మీద పీకలదాకా కోపం తెచ్చుకోవడం […]

Written By: Neelambaram, Updated On : January 9, 2023 8:52 am
Follow us on

Chiranjeevi Satires On Koratala: మెగాస్టార్ చిరంజీవి తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో చూడని హిట్ అంటూ లేదు..చూడని ఫ్లాప్ అంటూ లేదు..ఎంతో మంది డైరెక్టర్స్ తో ఆయన కలిసి పనిచేసాడు..తనకి డిజాస్టర్ ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తోను మరోసారి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి..ఫ్లాప్ అయ్యింది కదా అని డైరెక్టర్ మీద కోపం పెంచుకునే మనస్తత్వం కాదు చిరంజీవిది..అందుకే అందరూ ఆయనని అంతలా అభిమానిస్తారు..కానీ చిరంజీవి ఒక డైరెక్టర్ మీద పీకలదాకా కోపం తెచ్చుకోవడం కొరటాల శివ విషయంలోనే జరిగింది.

Chiranjeevi

గత ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే..చిరంజీవి కెరీర్ లోనే అతి చెత్త సినిమా అంటూ అందరూ అభిమానులు అప్పట్లో కొరటాలశివ పై తీవ్రమైన అసహనం చూపించారు..చిరంజీవి కూడా కొరటాల శివ తో షూటింగ్ సమయం లో చాలా ఇబ్బందులను ఫేస్ చేసాడట..తన మాటని లెక్కచెయ్యనందుకు చిరంజీవి కి కొరటాల శివ మీద ఇప్పటికీ కోపంగానే ఉంది.

అందుకు లేటెస్ట్ ఉదాహరణ గా నిలిచింది నిన్న జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ ని పొగుడుతూ కొరటాల శివ పై పరోక్షంగా సెటైర్లు వేసాడు మెగాస్టార్..ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ బాబీ కేవలం నా అభిమాని మాత్రమే కాదు..ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి..అతని పనితనం చూసినప్పుడల్లా నాకు ఎంతో ముచ్చట వేసింది..ఎల్లప్పుడూ అద్భుతమైన ఔట్పుట్ ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు..సినిమా అద్భుతంగా వచ్చింది కదా..ఇంకా ఎందుకు అయ్యా ఎడిటింగ్ రూమ్ లో కూర్చుంటావు..కాసేపు రిలాక్స్ అవ్వు అని చెప్తే, లేదు అన్నయ్య నాకు ఎందుకో ఈ సన్నివేశం కొద్దిగా తేడా కొడుతోంది.

Chiranjeevi Satires On Koratala

ఇంకా బాగా రీ వర్క్ చెయ్యాలని పరితపిస్తుంటాడు..నాకు ఏదైనా తేడా అనిపించి కొన్ని మార్పులు చెప్తే అవునా అన్నయ్య ఒక రెండు గంటలు సమయం ఇవ్వండి నేను సెట్ చేస్తాను అని చెప్పి నేను ఊహించిన దానికంటే బెస్ట్ ఔట్పుట్ రప్పించడానికి ట్రై చేసాడు..ఏదైనా చెప్తే నువ్వెంటి నాకు చెప్పేది..నాకు అన్నీ తెలుసు అని కొంతమంది డైరెక్టర్స్ లా అతను ప్రవర్తించడు’ అంటూ కొరటాల శివ పై పరోక్షంగా కామెంట్స్ చేసాడు మెగాస్టార్..ఆయన గత చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొరటాల శివ పై ఇలాంటి కామెంట్స్ చేసాడు..దీనిని బట్టీ చూస్తుంటే అసలు కొరటాల శివ ఆచార్య సెట్స్ లో చిరంజీవి మాటకి ఏమాత్రం విలువ ఇవ్వలేదని అర్థం అవుతుంది.