Pawan Kalyan- Chandrababu: పచ్చ మీడియా కూస్తున్నట్టు… చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాదు. అది పలు ఎన్నికల్లో నిరూపితమైంది.. వాటిని మనం ఉదాహరణలతో చెబితే పచ్చ మీడియా ఒప్పుకోదు.. పైగా మా బాబోరు 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు అంటూ చాటింపు వేస్తుంది. అంతేకాదు దేశ రాజకీయాలను శాసించారని డప్పులు కొడుతుంది. అలాంటి బాబుకు 2019 ఎన్నికల్లో బీభత్సమైన క్షవరం అయింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం 23 దగ్గర ఆగిపోయింది.

ఇప్పుడు పవన్ కావాల్సి వచ్చింది
2014 ఎన్నికల్లో చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా పోటీ చేయడంతో ఆంధ్రప్రదేశ్లో టిడిపి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన అసలు బుద్ధిని చూపించారు. రాజధాని రైతుల కోసం నాడు పవన్ కల్యాణ్ పోరాటం చేస్తే బాబు అండ్ కో హేళన చేశారు. అంతే కాదు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా అవమానించారు. దీన్ని తట్టుకోలేకే పవన్ నిరసన గళం వినిపించాల్సి వచ్చింది. ఇక జన సేన నాయకులను టీడీపీ లో చేర్చుకున్నారు. అయినప్పటికీ పవన్ వెరవ లేదు. పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ కౌలు రైతులకు కోట్లాది రూపాయల పరిహారం ఇస్తున్నారు.
పవన్ చరిష్మా వేరు
పవన్ కల్యాణ్ కు యూత్ లో ఫాలోయింగ్ ఉంది. మొన్న వైజాగ్ లో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వెనకడుగు వేయలేదు. పైగా ముందుకే వెళ్ళారు. ఈ సమయంలో బాబు పవన్ కు సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును జగన్ ప్రభుత్వం కాల రాస్తోందని ఆరోపించారు..ఆ తర్వాత నెల్లూరు, గుంటూరు ఘటనలు జరిగాయి.. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి పరామర్శించారు..ఇది పవన్ కల్యాణ్ లో ఉదాత్త గుణానికి ఒక ఉదాహరణ.

గెలిచే సీన్ లేదు
బాబు 40 ఏళ్ల అనుభవం ఆ పార్టీని 2023 లో గెలిపించే అవకాశం లేదు..పైగా చాలా మంది నాయకులు లోకేష్ అతి ప్రవర్తనతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వారు ఇలాంటి ఇబ్బందులు చవి చూశారు. వాటిని తట్టుకోలేకే చాలా మంది పార్టీని వీడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకాబట్టే బాబు పవన్ కు స్నేహ హస్తం ఇచ్చారు. కలలో కూడా శత్రువుకు అపాయం చేయని పవన్ కల్యాణ్.. అందుకు ఓకే చెప్పారా లేదా అనేది పక్కన పెడితే… 40 ఏళ్ల అనుభవం ఎమ్మెల్యే గా కూడా గెలవని ఓ వ్యక్తి ఎదుట సాగిల పడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నది.