
1 Rupee Controversy: బస్‌ల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి రూపాయి, రెండు రూపాయలు చిల్లర లేదని ప్రయాణికులకు ఇవ్వాల్సిన డబ్బులను కండక్టర్లు ఎగ్గొడుతుంటారు. ప్రయాణికులు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికూడా కండక్టర్ చిల్లర లేదని రూపాయి ఎగ్గొట్టాడు. దీంతో అందరిలా ఆయన వదిలేయలేదు. మూడేళ్లు కండక్టర్‌పై న్యాయ పోరాటం చేశాడు. చివరకు విజయం సాధించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి పరిహారం దక్కించుకున్నాడు.
బెంగళూరులో..
2019లో బెంగళూర్‌లోని శాంతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపోకు రమేశ్‌నాయుక్ అనే వ్యక్తి బీఎంటీసీ బస్సులో ప్రయాణించాడు. రమేశ్ కండక్టర్‌కు టికెట్ కోసం రూ.30 ఇవ్వగా, బస్సులో ఉన్న లేడీ కండక్టర్ రూ.29కి టిక్కెట్ ఇచ్చింది. తనకు ఇంకా రూపాయి రావాల్సి ఉందని, ఇవ్వమని రమేశ్ అడిగాడు. తన దగ్గర చిల్లర లేదని చెప్పిన కండక్టర్, అంతటితో ఆగకుండా రమేశ్‌ను దుర్భాషలాడింది
రూ.15 వేల పరిహారం కోరుతూ..
కండక్టర్ ప్రవర్తనతో మనస్తాపానికి గురైన రమేశ్ తనకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రమేశ్ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. అతడికి ఇవ్వాల్సిన రూపాయితోపాటు ఫిర్యాదుదారుడు కోరిన రూ.15 వేలల్లో ప్రస్తుతం రూ.2 వేలు చెల్లించాలని, లీగల్ ఫీజు కింద రూ.వెయ్యి చెల్లించాలని ఆదేశించింది మిగిలిన మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని సూచించింది. అలా చేయని పక్షంలో ఏడాదికి రూ.6 వేల చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. సమస్య చిన్నదిగా అనిపించినా, అది వినియోగదారుడి హక్కుకు సంబంధించిన అంశంగా గుర్తించాలంటూ రమేశ్‌ను కోర్టు అభినందించింది.

ఈ సమస్యను గుర్తించిన ఆర్డీసీ ఎండీ…
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చెపట్టిన సజ్జనార్.. ఇలాంటి సమస్య వస్తుందని ముందే గుర్తించినట్లు ఉన్నాడు. పోలీశ్ శాఖలో పనిచేసిన అనుభవంతో ఆయన లీగల్‌గా సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఆర్టీసికి ఆదాయం పెంచేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిల్లర సమస్య సాకుతో ధరలను క్రబమద్ధీకరించారు. టికెట్ చార్జీలు రౌండ్‌ఫిగర్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో రూ.10 కనిష్ట టికెట్ ఉంది. మిగతా చార్జీలన్నీ రూ.20, రూ.30, రూ.40, రూ.50 ఇలా వందల్లో ఉన్నాయి. దీంతో చిల్లర సమస్య పరిష్కారం కావడంతోపాటు కండక్లర్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చేశారు. అదే సమయంలో సర్దుబాటు కారణంగా ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తోంది.