
Sachin Tendulkar Diary: క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్. మాస్టర్ బ్లాస్టర్‌గా కీర్తి గడించిన సచిన్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను తిరగరాశారు. ప్రపచ రికార్డులు నెలకొల్పారు. కానీ, సచిన్‌కంటే ముందే, సచిన్ కంటే గొప్పగా ఆడే క్రికెటర్ కూడా ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన ఆట చూసి సచినే చప్పట్లు కొట్టేవాడు, ఆయన ఆడిన బ్యాట్ కోసం నాడు సచిన్ తహతహలాడాడు అంటే అతను ఎంత గొప్ప ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆయన బ్యాట్ సచిన్ భద్రపర్చుకున్నాడు. మరి సచిన్‌నే ఇన్‌స్ప్రేషన్ చేసిన ఆక్రికెటర్ ఎవరు.. సదరు క్రికెటర్ ఇప్పుడు ఎక్కడున్నాడు.. అతను ఎందుకు వెలుగులోకి రాలేదు.. ఆయన అంతగొపప క్రికెటర్ అని ఎవరు చెప్పారు అన్న ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి. ఆ క్రికెటరే అనిల్ గౌరవ్. ఆయన గురించి చెప్పింది ఎవరో కాదు స్వయానా సచిన్ టెండుల్కరే తన డైరీలో రాసుకున్నాడు. అయితే అంతగొప్ప క్రికెటర్ వెలుగులోకి రాకుండా కనుమరుగు కావడానికి ఆయన సోదరుడే ప్రధాన కారణం.
అనిల్ ఆయన శిష్యుడే..
అనిల్ గౌరవ్, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ.. వీరు ముగ్గురు క్రికెట్‌లో సమకాలీకులు. వీరికి కోచ్ రమాకాంత్ అచ్రేకర్. టాలెంటెండ్ క్రికెటర్ల కోచ్‌గా రమాకాంత్ అచ్రేకర్‌కు పేరుంది. ఆయన ప్రియ శిష్యుడు, హైలీ టాలెంటెండ్ క్రికెటర్ అనిల్ గౌరవ్. ముగ్గురికీ కోచింగ్ ఇచ్చిన అచ్రేకర్, ఎక్కువ ప్రాధాన్యత మాత్రం అనిల్‌కే ఇచ్చేవాడు. నెట్ ప్రాక్టీస్‌లో కూడా ఒక్క అనిల్‌కు మాత్రమే సెలక్షన్ ఆప్షన్ ఇచ్చేవాడు. సచిన్, వినోద్‌కు మాత్రం ఆప్షన్ ఇచ్చేవాడు కాదు. అంతేకాదు సచిన్, వినోద్ కాంబ్లీకి అనిల్‌ను చూపిస్తూ కోచింగ్ ఇచ్చేవాడు. వారు కూడా అనిల్‌ను ఇన్‌స్ప్రేషన్‌గా తీసుకుని ఆట నేర్చుకున్నారు. అనిల్ గౌరవ్ మ్యాచ్ ఆడేందుకు వస్తుంటే గౌరవ్ నామస్మరణతో మైదానాలు మార్మోగేవి. కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అనిల్ గౌరవ్ తల్లి వస్తే అచ్రేకర్ ఆమెదగ్గరక వెళ్లి అనిల్ గురించి గొప్పగా చెప్పాడట. మనంద గౌరవం పెంచుతాడని కీరించాడట. అంత నమ్మకం కోచ్‌కు గౌరవ్‌పై ఉండేది. ఇక సచిన్ మొదట మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసింది గౌరవ్ బ్యాట్‌తోనే. ఇవన్నీ సచిన్ తన ఆటో బయోగ్రఫీలో రాసుకున్నవే.
నేడు దయనీయ పరిస్థితి..
ఇంత గొప్ప క్రికెటర్ నేడు దయనీయ స్థితిల ఒక స్లమ్ ఏరియాలో ఉంటున్నాడు. గల్లీలో పిల్లతో రబ్బర్ బాల్‌తో క్రికెట్ ఆడుతున్నాడు. మద్యం, డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాల్సిన క్రికెటర్ జీవితం ఇలా మారడానికి రెండు ఒకటి అనిల్ సోదరుడు అజిత్. మరోకటి అనిల్‌లో ఆసక్తి చర్చిపోవడం. పోరాడే ఓపిక నశించడం. దీంతో భారత దేశంలో ఒక మంచి క్రికెటర్ వెలుగులోకి రాకుండా పోయారు.
కరుడు గట్టిన క్రిమినల్ అజిత్ ..
అనిల్ సోదరుడు అజిత్ కరుడుగట్టిన క్రిమినల్ నాటు ముంబయ్‌లో డబ్బుల కోసం హత్యచేయడంలో దిట్ట. షార్ప్ షూటర్‌గా అజిత్‌కు గుర్తింపు ఉంది. దీంతో హత్య జరిగిన ప్రతీసారి అజిత్ తప్పించుకుని పారిపోయేవాడు. కానీ పోలీసులు అజిత్ కోసం అతని సోదరుడు అనిల్, తల్లి, కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టేవారు. జైల్లో పెట్టి కొట్టేవారు. అజిత్ కారణంగా పోలీసుల టార్చర్ పెరుగడంతో అనిల్‌కు క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయింది. క్రమంగా పోలీసుల దెబ్బలకు తాళలేక మద్యానికి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు.

ఇంకా దయనీయం ఏమిటంటే, రోడ్డు పక్కన తాగి పడేసిన సిగరెట్టు ఏరుకుని తాగేవాడు అనిల్. ఇంతలా దిగజారడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు అజితే. మరో బలమైన కారణం పోలీసుల టార్చర్ కారణంగా ఆయనకు క్రికెట్ ఆడాలన్న ఆసక్తి తగ్గిపోయింది. చివరకు గల్లీలో పిల్లలతో రూపాయి, రెండు రూపాయల బెట్టింగ్ పెట్టి క్రికెట్ ఆడేస్థాయికి దిగజారాడు. ఆయన కోచ్ అచ్రేకర్ ఒకరోజు అనిల్‌ను పట్టుకుని అడిగితే, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల కంటే గల్లీలో ఆడే క్రికెట్‌లోనే కిక్కు ఉందని చెప్పాపడ. అంతలా ఆయన మానసికంగా బలహీనుడయ్యాడు.