Telangana : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా పై ఉపోద్ఘాతానికి మినహాయింపు కాదు. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష పార్టీ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా వదలకుండా తిట్టుకుంటున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి నాశనం అవుతోంది. వ్యక్తిత్వ హననం ప్రధాన ఎజెండా అవుతోంది. ఇక సోషల్ మీడియా గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఇషాన్ సారంగా విమర్శలు చేయడం.. సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ బురద చల్లుకోవడం పరిపాటి గా మారింది. దీనివల్ల రాజకీయాలు అంటేనే చాలామంది ఏవగింపును వ్యక్తం చేస్తున్నారు. తుచ్చ రాజకీయాలు.. చెత్త రాజకీయాలంటూ విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రాజకీయాలలో మార్పు తేవడానికి.. రాజకీయ నాయకుల నోటికి తాళం వేయడానికి ఎవరూ సంకల్పించడం లేదు. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఒక కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది.
Also Read : మద్యం తెలంగాణలో సామాజిక సమస్య కాదా?
సమస్యలపై చర్చించారు
తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సంవాదాలు చోటు చేసుకుంటున్నాయి. అర్థవంతమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక విమర్శల సంగతి సరే సరి. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసిపోయారు. ప్రజా సమస్యలపై చర్చించడం మొదలుపెట్టారు. సభ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై చర్చించారు. పథకాలపై.. అభివృద్ధి పనులపై సమాలోచనలు జరిపారు. ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి.. కొంతమంది ఎమ్మెల్యేలు.. అధికారపాటి నుంచి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా మిగతా ప్రజా ప్రతినిధులు పక్కపక్కనే కూర్చుని చర్చించడం మొదలుపెట్టారు. సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి. ” ఇది కదా తెలంగాణ అంటే.. ఇది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే.. తెలంగాణ సమాజం కోరుకునేది ఇలాంటిదే. ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఎప్పటికీ ఉండాలి. ఇలా ఉంటేనే తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుంది. నాయకులు అభివృద్ధిలో పోటీపడాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీపడాలి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు కాదని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ అంటే నిలువెల్లా ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల ద్వారానే సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలని.. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని.. అందువల్లే నేతలు విమర్శలు మానుకొని.. వ్యక్తిగత దూషణలు పక్కనపెట్టి.. స్నేహపూర్వక వాతావరణం లో పరిపాలన సాగించాలని.. అధికార పక్షం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని.. ప్రతిపక్షం ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేయాలని.. నెటిజన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ ధోరణి మార్చుకోవాలని.. తిట్ల పురాణానికి పుల్ స్టాప్ పెట్టాలని సూచిస్తున్నారు
Also Read : రేవంత్ ఫైర్.. కేటీఆర్ వైల్డ్ ఫైర్.. అసెంబ్లీలో ఎవరూ తగ్గట్లేదే!